(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)ఆత్మకూరు మండల కేంద్రంలోని పంచలింగాల శివాలయం అయ్యప్ప స్వామి మహా పడిపూజను హరిహర క్షేత్రం ప్రధాన అర్చకులు అనంత పద్మనాభయ శర్మ,అర్చకులు వెంకటేశ్వర్లు శర్మ సంతోష్ శర్మ గురుస్వామి వేద మంత్రో చారణల తో నిర్వహించారు. శనివారం మండల కేంద్రంలోని అయ్యప్ప స్వాముల బృందం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహా పడిపూజ కు ముందుగా పంచలింగాల శివాలయములో పంచ అమృతాలతో అభిషేకాలు నిర్వహించిన అయ్యప్ప మాల ధారణ దీక్షాపరులు, శ్రీ రుక్మిణి సత్యభామ వేణుగోపాల స్వామి దేవాలయం దేవాలయము నుంచి అయ్యప్ప మాలధారణ దీక్షాపరులు అయ్యప్ప స్వామితో నగర సంకీర్తన నిర్వహించారు. భక్తులు అడుగడుగునా మంగళహారతులు కొబ్బరికాయలు పండ్లు, మంచినీటి బిందెలతో తీసుకొని వచ్చి అయ్యప్పకు నీలారపించారు. మంగళ హారతిలిచి కొబ్బరికాయలు కొట్టారు. మేళ తాళాలు భక్తి పాటలు ఆలపిస్తూ భజనలు చేస్తూ భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మాలధారణ దీక్షాపరులు నగర సంకీర్తనలు నిర్వహించారు. పంచ లింగాల శివాలయం కు చేరుకొని పూజలు నిర్వహించి మహా పడిపూజ కార్యక్రమాన్ని వేద పండితులు ముందుగా అయ్యప్పకు పంచ అమృతాలు, గందాభిషేకం, పన్నీరు, నారికేలా, కుంకుమ, బస్పా,అభిషేకాలు, నిర్వహించారు. కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, మాజీ సర్పంచ్ పర్వతగిరి రాజు, అభిషేకం నిర్వహించారు. అయ్యప్ప నామస్మరణతో ఆత్మకూర్ అంతా మారు మోగింది స్వామియే శరణమయ్యప్ప…. శరణు శరణు అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప.. అంటూ భక్తులు అయ్యప్ప నామ స్మరణతో భక్తులు తన్మయం చెందారు. నావ ఎక్కి పోతుంటే నావఅయ్యప్ప నావ సాగిపోతుంది అంటూ అయ్యప్ప భక్తులు పాడుతున్న పాటలకు భక్తులు పార పారవశ్యం తో పులకరించిపోయారు. ఈ మహా పడిపూజలో ఆత్మకూరు మండలం తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అయ్యప్ప మాల ధారణ దీక్షాపరులు పడి పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు శ్రీనివాస్ రెడ్డి, రేవూరి జయపాల్ రెడ్డి, కుక్కల చంద్రమోహన్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి బయ్య పైడి కళ్యాణ్, బిజెపి పరకాల నియోజకవర్గం కిసాన్ మోర్చా కన్వీనర్ వంగాల బుచ్చిరెడ్డి, మాజీ సర్పంచ్ పలకల మంజుల, టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు పాపని రవీందర్ తో పాటు గురు స్వాములు మాల ధారణ స్వాములు, ఆత్మకూర్ గ్రామస్తులు పాల్గొన్నారు.


