(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ)హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో భారత రాజ్యాంగ నిర్మాత, సమానత్వ సమాజానికి శిల్పి, మహానుభావుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జ్యోతి అధ్యక్షతన ఈ కార్యక్రమం సాగింది. కార్యక్రమంలో ప్రారంభంగా ప్రొఫెసర్ జ్యోతి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆధునిక భారతానికి బాటలు వేసిన మహోన్నత నాయకుడని, ఆయన చూపించిన బౌద్ధిక స్పూర్తి యువతకు మార్గదర్శకమంటూ పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి వ్యక్తికి సమాన హక్కులు సంపాదించిపెట్టడానికి జీవితమంతా పోరాడిన దృఢ సంకల్పం అంబేద్కర్‌దేనని, ఆయన రాజ్యాంగ నిర్మాణంలో ప్రదర్శించిన దూరదృష్టి ప్రపంచానికి ఆదర్శమని ఆమె అన్నారు. విద్య మాత్రమే వ్యక్తిని శక్తివంతం చేసే సాధనమని అంబేద్కర్ విశ్వసించారని, ఆ దిశగా విద్యార్థులు కృషి చేయాలని ప్రొఫెసర్ జ్యోతి అన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ రెహమాన్, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
previous post

