జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్: గ్రేటర్ వరంగల్ నగరంలో
సమర్థవంతం గా చెత్త శాంపిల్ ల సేకరణ చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు.శుక్రవారం వరంగల్ పరిధి పోతన నగర్ లో గల బయో మిథనైజేషన్ ప్లాంట్ తో పాటు ఎన్ ఐ యు ఏ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫ్సైర్స్) వారు సేకరిస్తున్న చెత్త శాంపిల్స్ తీరు ను కమిషనర్ పరిశీలించి సమర్థవంతం గా చేపట్టుటకు తగు సూచనలు చేశారు.ఈ సందర్భం గా కమిషనర్ మాట్లాడుతూ నగరం లోని వివిధ ప్రాంతాల్లో ఏ రకమైన చెత్త వస్తుందో అధ్యయనం నిర్వహించి నివేదిక ఇవ్వడానికి వీలుగా ఎన్ ఐ యు ఏ వారు నగరం లోని వివిధ ప్రాంతాల నుండి చెత్త శాంపిల్స్ ను సేకరించి ఆ ప్రాంతం నుండి ప్లాస్టిక్, కాగితం, ఆహార పదార్థాలు తదితర వ్యర్థాలను సేకరించి అందులో గల రసాయనాలను గుర్తించి ఆ ప్రాంతం లో ఏ రకమైన చెత్త వ్యర్థాలు వస్తున్నాయో గుర్తించడం వల్ల భవిష్యత్తులో ఆ ఏరియా లో ఎలాంటి ప్లాంట్ లు ఏర్పాటు చేయడానికి అనుకూలమో రిపోర్ట్ అందజేస్తారని ఇందులో భాగం గా కేటగిరైజేషన్ సెగ్రిగేషన్ శాంపిల్ కలెక్షన్ అంశాల పై దృష్టి సారించి గుర్తింపు చేపడతారని ఈ ప్రక్రియ ను ప్రతి సంవత్సరం చేపట్టడం వల్ల ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని కమిషనర్ అన్నారు.
ఈ కార్యక్రమం లో సానిటరీ సూపర్ వైజర్ లు గోల్కొండ శ్రీను నరేందర్ తో సానిటరీ ఇన్స్పెక్టర్ లు మధు రాజు తదితరులు పాల్గొన్నారు
previous post

