జై భారత్ వాయిస్ నూజివీడు
మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా ముదినేపల్లి మండలం అల్లూరు గ్రామాలలో నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎంఎల్సీ. జయమంగళ వెంకటరమణ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ కరెంటు కోతలతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో వ్యవసాయ రంగానికి ఉచిత కరెంటును,
ఉచిత వైద్యం 104 అంబులెన్స్ సౌకర్యం, అందజేసిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డి కే దక్కుతుందన్నారు. వైయస్ హయాంలో పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారికి అండగా నిలిచారని గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇండ్లతో ప్రతి పేదోడికి సొంతింటి కల నెరవేరిందని,, మళ్లీ ఇప్పుడు YS జగనన్న హయాంలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నారని కొనియాడారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమం లో ముదినేపల్లి ఎంపిపి రామిశెట్టి సత్యనారాయణ , రాష్ట్ర హోసింగ్ బోర్డు డైరెక్టర్ గంటా సంధ్య , మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు అల్లూరు సర్పంచ్ శీలం రామకృష్ణ, వైస్ ఎంపిపి రాదా, మాజీ మండల పార్టీ అధ్యక్షులు మొట్రూ ఏసుబాబు, బిసి నాయకులు కోమటి విష్ణువర్ధన్, బత్తిన కిషోర్ కో ఆప్షన్ సభ్యులు షేక్ అల్లాబక్షు, గుళ్లిపల్లి శ్రీనివాసరావు, రత్నం,కోణంగి ప్రసాద్ కుర్మా మైనర్ బాబు, బోయిన శ్రీనివాసరావు,పత్తి సీతారాం,,పేరం కిషోర్ తుమ్మ రామశాస్త్రి పేరం ఆంజనేయులు బోయిన బోగేశ్వరావు, మల్లికార్జున మహేష్ రాజు, రాచురి కుమార్ దివి సతీష్ వైఎస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు రాజశేఖర్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు.

previous post
next post