భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు): మినీ మేడారంగా ప్రసిద్ధిగాంచిన అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతరలో బందోబస్తు పెంచాలని వరంగల్ ఈస్ట్ జోన్,డిసిపి అంకిత్ కుమార్ అన్నారు. నీటిపారుదల శాఖ ఎస్సీ గాయత్రి,పరకాల ఏసిపి సతీష్ బాబు, బుధవారం ఆత్మకూరు మండలంలోని అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతరను సందర్శించి మొక్కలు చెల్లించుకున్నారు అనంతరం జాతర పరిసరాలను పరిశీలించి పోలీస్ బందోబస్తు ఏర్పాట్లపై ఏ సీ పీ అంకిత్ కుమార్ స్థానిక సీఐ సంతోష్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాతరలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ నిఘాను ఏర్పాటు చేయాలని సీఐ ఆర్ సంతోష్ ని ఆదేశించారు. అలాగే మండలంలోని కటాక్షపూర్ వద్ద గల చెక్ పోస్ట్ ని సందర్శించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు జాతరలో మంచినీటి సౌకర్యం స్నాన ఘట్టాల పైన ఏర్పాట్లను ఆర్డబ్ల్యూఎస్,ఎస్సి గాయత్రి పరిశీలించారు. జాతరలో భక్తులకు ఎలాంటి తాగునీటిఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జాతర మాజీ చైర్మన్ బోరిగం స్వామి గ్రామ సర్పంచ్ మహేందర్ ఈవో అద్దంకి నాగేశ్వరరావు గ్రామ పార్టీ అధ్యక్షులు ఏలియా తదితరులు పాల్గొన్నారు
previous post

