Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఎన్నికైన ప్రజాప్రతినిధులు గ్రామాభివృద్ధికి తోడ్పడాలిఎమ్మెల్యే రేవూరి

భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)గ్రామాల సర్పంచులు గ్రామాభివృద్ధికి తోడ్పడాలి అని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు . నమ్మకం విశ్వాసం పొందిన వ్యక్తులకు మాత్రమే సర్పంచ్ గా రెండవసారి ప్రజలు ఎన్నుకొంటారని అన్నారు.ప్రజలకు బాధ్యతాయుతమైన పాలన అందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు గురువారం
ఆత్మకూరు గ్రామ సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు మరియు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారానికి హాజరైన ఎమ్మెల్యే వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రజలకు బాధ్యతాయుతమైన పాలన అందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం అన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాయి అని అన్నారు.ఎన్నికల్లో ఆత్మకూరులో డబ్బులకు ప్రాధాన్యత ఇవ్వకుండా మంచి వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చినారు.ఎన్నికల్లో డబ్బులే ప్రాధాన్యత అని తగ్గిన రోజే ప్రజాస్వామ్యంలో అర్థం ఉంటుందని అన్నారు.నమ్మకం విశ్వాసం పొందిన వ్యక్తులకు మాత్రమే సర్పంచ్ గా రెండవసారి ప్రజలు ఎన్నుకొంటారని రాజుకు గ్రామ ప్రజలపై సంపూర్ణమైన విశ్వాసం ఉందన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలకులు ప్రజాల ఆమోదం పొందిన నాయకులను అణచివేసే చర్యలు చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని, తాను రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఆత్మకూరు గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని,గ్రామంలోని సమస్యలను ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. అలాగే ఆత్మకూరు గ్రామాన్ని మోడల్ సోలార్ విలేజ్ గా కృషి చేస్తానని, అలాగే ప్రాంతానికి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ మంజూరైనదని అన్నారు.

Related posts

మద్యం తాగి వాహనాలు నడిపి కేసులు నమోదు చేస్తాం_ సీఐ సంతోష్

కళాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తాం.-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.

శివాలయంలో  ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రత్యేక పూజలు