(జై భారత్ వాయిస్ ఆత్మకూరు న్యూస్):
మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా జాతీయ రహదారి ఎన్‌హెచ్–163 పై ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా హోల్డింగ్ పాయింట్లను గుర్తించామని ఆత్మకూరు సీఐ సంతోష్ తెలిపారు. ఇందులో గుడెపాడు, నీరుకుళ్ళ క్రాస్, కాటాక్ష్‌పూర్ ప్రాంతాలను హోల్డింగ్ పాయింట్లుగా నిర్ణయించామని అన్నారు.ఈ నేపథ్యంలో బుధవారం ఆయా హోల్డింగ్ పాయింట్లలో విస్తృతంగా శుభ్రత పనులు చేపట్టడంతో పాటు, “మేడారం జాతర–2026 హోల్డింగ్ పాయింట్” అనే సూచిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ సిఐ సంతోష్ తెలిపారు.మేడారం జాతర సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేపడుతున్నామని, శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని సిఐ సంతోష్ పేర్కొన్నారు.
previous post

