Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు మండల కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులుగా కోమాండ్ల చంద్రారెడ్డి

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు న్యూస్ )
ఆత్మకూరు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కోమండ్ల చంద్రారెడ్డిని ఆత్మకూరు మండల సేవాదళ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించినట్లు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు బొచ్చు చందర్ తెలిపారుఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన కోమాండ్ల చంద్రారెడ్డి పూర్వం నుండి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు తన వంతుగా సహకరిస్తూ అవసరమైన చోట కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తూ పార్టీ ఎదుగుదలకు కృషి చేశారని ఆయన అన్నారు. చంద్రారెడ్డి సేవను గుర్తిస్తూ ఆత్మకూరు సేవాదళ్ అధ్యక్షులుగా కోమండ్ల చంద్రారెడ్డి ని నియమించామని అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైనకోమండ్ల చంద్రారెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకంతో బాధ్యతను నాకు అందించినటువంటి హనుమకొండ జిల్లా సేవాదళ్ అధ్యక్షులు బొచ్చు చందర్ కి, నా నియమాకానికి సహకరించినటువంటి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఇనుగాల వెంకట్రామ్ రెడ్డికి,దళిత రత్న నత్తి కొర్నేల్ కి, టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ స్టేట్ కన్వీనర్ పెరుమాండ్ల రామకృష్ణకి, కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు మండల అధ్యక్షులు కమలాపురం రమేష్ కి, ఆత్మకూరు గ్రామ సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు కి, మండలం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బరుపట్ల కిరిటికి, పరికిరాల వాసుకి, జిల్లా కాంగ్రెస్ నాయకులు రేవూరి జలంధర్ రెడ్డి కి,మాజీ పీఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్ కి,నా నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నాకు వచ్చిన అవకాశాన్ని పార్టీ కోసం, పార్టీ ఎదుగుదల కోసం నా శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు.

Related posts

Kcr నా కళ్లముందే తెలంగాణ ఆగమైతుంటే.నాకు దుఃఖం కలిగిస్తోంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

నీరు కుల్ల లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Jaibharath News

ఆత్మకూరు లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన