(జై భారత్ వాయిస్ ఆత్మకూరు న్యూస్) ఆత్మకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ శుక్రవారం వారం ఆత్మకూరు మండల కేంద్రంలో, విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు సిఐ సంతోష్ తో పాటు ఎస్‌ఐ తిరుపతి కలిసి సీఎమ్ కప్‌లో పాల్గొంటున్న క్రీడాకారులను ఘనంగా స్వాగతించారు. విద్యార్థుల శారీరక-మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయని పేర్కొంటూ, చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుండాలని సి ఐ సంతోష్ క్రీడాకారుల ను ఉద్దే శించి మాట్లాడారు. క్రీడలను ప్రోత్సహించాలని అన్నారు. సీపీ కప్‌లో భాగంగా తిరుమలగిరి నుంచి గుడెఫాడ్ వరకు 5 కిలోమీటర్ల వాక్ నిర్వహించగా, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి , తిరుమలగిరి సర్పంచ్ బూర దేవేంద్ర రాజేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

