Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

Nallabelly నల్లబెల్లిలో సంక్రాంతి సంబరాలు

నల్లబెల్లిలో సంక్రాంతి సంబరాలు (జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్)గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి యొక్క ప్రతిష్టతను తెలియపరిచేలా ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు సర్పంచి జక్కి అనిత శ్రీకాంత్ తెలిపారువరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాలను నల్లబెల్లి గ్రామ సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ ప్రారంభించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్రామంలో మహిళలకు సర్పంచ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలోమహిళలు ఉత్సాహంగా  పాల్గొని తీరురోక్క రంగులతో అందమైన ముగ్గులను వేశారు.సంక్రాంతి యొక్క ప్రతిష్టతను తెలియపరిచేలా ముగ్గులను మహిళలు వేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ మాట్లాడుతూ గ్రామంలో మహిళలకు గ్రామ ప్రజలకు పండుగలను వాటి విశిష్టతను తెలియపరచడం కోసం రంగోలి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు

మహిళలు పోటీల్లో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని అందరూ పండగ వాతావరణం లో సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. ముగ్గులు వేసిన వారికి ప్రథమ బహుమతి బోళ్ల సింధు,ద్వితీయ బహుమతి ఆకారపు శివాని రమ్యశ్రీ,తృతీయ బహుమతి పసునూరి రవీనా మౌనిక గెలుపొందడం జరిగింది. పోటీల్లో ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరిగింది. గ్రామంలో ప్రతి పండుగను గ్రామంలో ప్రతి పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మేకల దేవేందర్, వార్డు సభ్యులు మహమ్మద్ జమీలాభి, పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ హుస్సేన్, గ్రామ ఏఈఓ శిరీష, గ్రామ కుల సంఘ పెద్దలు పోలసాని దేవేందర్ రావు,
గజ్జెల దేవేందర్, గొల్లపల్లి యాదగిరి, మహమ్మద్ జాఫర్, మరుపట్ల బాబు దుగ్యాల దుర్గారావు డోలి యాకయ్య బిర్రు యాకయ్య బొమ్మెర శ్రీనివాస్ బొజ్జ కృష్ణమూర్తి బొజ్జ నాగయ్య , తక్కలపల్లి శ్రీకాంత్ రావు బిర్రు రాములు బిర్రు చిన్న యాకయ్య బుర్ర చంద్రయ్య ,ప్రకాష్ కాంభోజయ్య యాకయ్య,  పొన్నం వేణు కర్రే ఓంకార్ వెంకన్న పాల్గొన్నారు

Related posts

వరంగల్ డిసిపి భారీ ని కలిసిన నరకాసుర ఉత్సవ కమిటీ సభ్యులు

Jaibharath News

బాదిత కుటుంబాన్ని పరామర్శ

పేదలకు అన్యాయం జరిగితే సహించేది లేదు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు