(జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ)
నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లకు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ,పంచాయితి రాజ్ చట్టం పై 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మొదటి విడతలో వరంగల్ జిల్లాలోని గీసుకొండ,సంగెం, చెన్నారావుపేట గ్రామాలకు సంబంధించిన 84 మందికి ఈ నెల 19 నుండి 23 వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు డిపిఓ కటకం కల్పన తెలిపారు.గీసుకొండ మండలం జాతీయ ఆదర్శ గంగదేవిపల్లి గ్రామములోని ఈటీసీ హాసన్పర్తి అనుసంధాన ట్రైనింగ్ సెంటర్ ను జిల్లా పంచాయితి అధికారి కటకం కల్పన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ శృతిహర్షిత పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపిఓ పాక శ్రీనివాస్ ,జిల్లా ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌలి,స్థానిక సర్పంచ్ కూసం స్వరూప రమేష్, యన్ ఐ అర్ డి నిమ్మల శేఖర్,పంచాయితి కార్యదర్శి రమ్య కుమారి, ప్రశాంత్,క్లస్టర్ ఆపరేటర్ వేల్పుల సురేష్ పాల్గొన్నారు.

