Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆర్ట్స్ కళాశాల సంస్కృత విభాగాధ్యక్షునిగా హరికుమార్ !

(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ) హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సంస్కృత విభాగ నూతన అధ్యక్షునిగా వేదాంతం హరికుమార్‌ను నియమిస్తూ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ పదవిలో ఆయన 1 సంవత్సరాల పాటు కొనసాగనున్నారు. సంస్కృత విభాగంలో విద్యా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడం, విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, డాక్టర్ చందర్, డాక్టర్ పుల్ల రమేష్, ఇతర అధ్యాపకులు వేదాంతం హరికుమార్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.సంస్కృత విభాగ అభివృద్ధికి ఆయన నాయకత్వం దోహదపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts

సమ్మక్క ఆగమనం తో ఎగిసిపడ్డ భక్తజనం

గృహలక్ష్మి లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందించిన ఎమ్మేల్యే

Jaibharath News

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఎస్సై కొంక అశోక్

Jaibharath News