April 7, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

గొడుగులను ,దుప్పట్ల ను వితరణ చేసిన ..ఏరుకొండ రవీందర్

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు )
ఆత్మకూరు మండలంలోని గూడేప్పాడు బస్టాండ్ వద్ద ఆత్మకూరు దేశాయి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కాంగ్రెస్ పరకాల నియోజకవర్గం సేవాదళ్ అధ్యక్షుడు ఏరుకొండ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో అరటి పండ్లు అమ్మే వారికి గొడుగులను పంపిణీ చేశారు. నిత్యం ఎండలో ఉండడం వల్ల అరటి పళ్ళు అమ్మే వారు పడే ఇబ్బందులు చూసి గొడుగులు అందించినట్లు చెప్పారు .అలాగే తిరుమలగిరి గ్రామంలో వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారికి సహాయం చేయడంలో తన వంతు సహాయంగా ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తున్నానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సర్పంచ్ బూర దేవేంద్ర రాజేందర్, లయన్స్ రాజు, సోమయ్య, అనిత, దేవేందర్,రామకృష్ణ, టీ.సత్యనారాయణ,నాగ బండి శివప్రసాద్,పాపని రవీందర్, రేవూరి దేవేందర్ రెడ్డి,బాదం వెంకటేశ్వర్లు,లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు

Jaibharath News

పునీత మదర్ తెరిసా 27వ వర్ధంతి వేడుకలు

ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (DMHO) అప్పయ్య..