Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

సాంఘిక సంక్షేమ మహిళ హాస్టల్ ను  జిల్లా కలెక్టర్  ప్రావిణ్య, డిఎంహెచ్ఓ తనిఖీ

( జై భారత్ వాయిస్ వరంగల్  స్టాప్ రిపోర్టర్ సాంబశివరావు )
వరంగల్ జిల్లాలోని రంగశాయిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ చెందిన  సాంఘిక సంక్షేమ మహిళ హాస్టల్ ను  జిల్లా కలెక్టర్  ప్రావిణ్య తో, కలిసి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కాజీపేట వెంకటరమణ  ఆకస్మికంగా సందర్శించారు, సందర్శన భాగంగా, వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన శిబిరంలో చికిత్స పొందుతున్న విద్యార్థులతో ఆమె స్వయంగా మాట్లాడి వారి ఆరోగ్యం క్షేమ సమాచారం తెలుసుకోవడం జరిగింది, అనంతరం ఆర్డిఓ, ప్రిన్సిపాల్ సిబ్బంది తో కలిసి ఆమె స్వయంగా వంటగదని, నిల్వ ఉన్న ఆహార ధాన్యాలను, భోజనశాలను, నీటి సరఫరా చేసే బావిని వాటర్ ప్లాంట్లను ఆమె స్వయంగా తిరిగి పరిశీలించడం జరిగింది. అనంతరం ప్రిన్సిపాల్ సిబ్బందితో మాట్లాడుతూ, కొన్ని సూచనలు చేయడం జరిగింది, తరగతి గదిలో విద్యార్థుల సామాన్లను పెట్టకుండా చూడాలని, హాస్టల్ గదిలో మంచాలను ఏర్పాటు చేయాలని, మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, సురక్షితమైన మంచినీటిని సరఫరా చేయాలని, కలెక్టర్  ఆదేశించారు. డిఎంహెచ్ఓ మాట్లాడుతూ వంటగదికి సంబంధించి, వాడే పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, వంటలు వండేందుకు శుభ్రమైన నీరు వాడాలని, ఆకుకూరలను, కూరగాయలను పూర్తిగా కడిగిన తర్వాతనే  వాడాలని, ఆహారం నిల్వ ఉన్న గదిలోకి, ఎలుకలు, క్రిమి కీటకాలు, రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నిలువ ఉన్న ఆహార పదార్థాలకు నీరు తగలకుండా చూసుకోవాలని,ఎవరికైనా జ్వ ర తీవ్రత లేదా అనారోగ్య సమస్యలు ఉన్నట్టయితే వారిని 108 వాహనం సాయంతో MGM తరలించాలని, లేదా దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లాలని  ఆదేశించారు, కళాశాల హాస్టల్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సురక్షితమైన నీటిని మాత్రమే తాగాలని, నిల్వ ఉన్న ఆహార పదార్థాలకు తేమ తగలకుండా చూసుకోవాలని, వండిన ఆహార పదార్థాల పైన మూతలు ఉంచుకోవాలని,  , ఆహారం తినే ముందు  మలవిసర్జన తర్వాత కాళ్లు చేతులు సబ్బుతో కడుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు తినకూడదని, వేడివేడి పదార్థాలు తినాలని విద్యార్థులకు దోమలు కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

Related posts

పాఠశాల విద్యార్థులకు పండ్ల పంపిణీ

కేంద్ర మంత్రి బండి సంజయిని కలసిన బీజేపీ గీసుగొండ మండల ప్రధాన కార్యదర్శి కొంగర రవి

పాంచాల రాయలస్వామిని దర్శించుకున్నా బీజేపీ నేతలు

Jaibharath News