(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
తెలంగాణ రాష్ట్రస్థాయిలో మేడారం తర్వాత స్థాయి
ఆత్మకూరు మండలం అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థాయిలో జరిగే ఈ జాతరకు రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నుంచి భక్తులు తరలివచ్చి తల్లులకు మొక్కులు తీర్చుకుంటున్నారు అగ్రంపహాడు పరిసరాలలో నెలకొన్న సమ్మక్క సారలమ్మలు భక్తుల కోరిన కోర్కెలు తీర్చుతారని ప్రగాఢ విశ్వాసం సమ్మక్క సారలమ్మలను తమ ఇలవేల్పుగా కొలుస్తారు అగ్రంపహాడులో నెల నుంచే సమ్మక్క సారలమ్మ పండుగ మొదలవుతుంది సమ్మక్క సారలమ్మ తల్లుల కథ జన బహుల్యంలో ఉన్నది మేడారం పరగణాను పరిపాలించే మేడరాజు కాకతీయ రాజులతో జరిపిన యుద్ధంలో సమ్మక్క సారలమ్మలు విరోచితంగా పోరాడారు. అనంతరము సమ్మక్క చిలకలగుట్ట మీదకు వెళ్లి అదృశ్యమవుతుంది. యుద్ధం తర్వాత కాకతీయ సేనలు ఓరుగల్లు కోటకు పయనమై మార్గమధ్యంలో అగ్రం పహాడ్ సమీపంలో ఒకరోజు విడిది చేస్తాయి ఆరోజు రాత్రి కాకతీయ మంత్రి యుగంధరుని కలలో సమ్మక్క సారలమ్మలు దేవతలుగా సాక్షాత్కరించి తమను ఇక్కడ ఏర్పాటుచేసి పూజించాలని కోరుతారు.తరువాత యుగంధరుడు జరిగిన వృత్తాంతమును కాకతీయ రాజులకు అందించి సమ్మక్క సారలమ్మలను గద్దెలుగా ప్రతిష్టించి పూజలు చేస్తారు అప్పటినుంచి సమ్మక్క సారలమ్మలను శక్తి స్వరూపాలుగా భావించి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కొలుస్తున్నారు మేడారం తరువాత ఇక్కడ సమ్మక్క సారలమ్మల జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది.మేడారం వెళ్లలేని భక్తులు జిల్లా కేంద్రానికి సమీపంలోని అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లి తమ మొక్కులను చెల్లిస్తారు. ఈసారి సమ్మక్క సారలమ్మ జాతరకు దేవాదాయ శాఖ అధికారులు పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులు విస్తృతంగా ఏర్పాటు చేశారు. అగ్రంపహడు సమ్మక్క జాతరకు దాదాపు 50 లక్షల నుంచి కోటి మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
previous post
next post

