Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఓటు హక్కుపై వినియోగంపై అవగాహన

(జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ)
జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని  గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రగతి మండల సమైక్య గీసుకొండ మండలం కార్యాలయంలో సమైక్య అధ్యక్షురాలు గట్టు రాధిక అధ్యక్షతన ఓటు హక్కు వినియోగ అవగాహన కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా మండల ప్రాజెక్టు మేనేజర్ ముక్కెర ఈశ్వర్ మాట్లాడుతూ ఓటును హక్కుతో ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల ఓటు క్రియాశీలకమవుతుందని, పారదర్శకమైన ప్రజాస్వామ్యక వ్యవస్థకు మన ఓటు  జవాబుదారీ కావాలని ఆ దిశలో ప్రతి ఓటరు అవగాహన పొందాలని అన్నారు.18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని  తెలిపారు.  కమ్యూనిటీ కోఆర్డినేటర్ సురేష్, మహిళా సంఘ సభ్యులచే ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకొని మహిళా సంఘ సభ్యులు ఇందిరా మహిళా శక్తి -ఓటర్ శక్తి,  అనే నినాదంతో మానవహారాన్ని ,  ర్యాలీని  నిర్వహించారు.సమైక్యఓబి సభ్యులు శారద శిల్ప పద్మావతి రజిత, జయంతిక,సిఆర్పీలు కవిత, శ్రీలత పాల్గొన్నారు.

Related posts

అగ్రంపహాడ్ సమ్మక్క జాతరకు భారీ బందోబస్తు పరిశీలించిన పోలీస్ అధికారులు

పారిశుధ్య కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి

ఎన్నికైన ప్రజాప్రతినిధులు గ్రామాభివృద్ధికి తోడ్పడాలిఎమ్మెల్యే రేవూరి