(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు) (అగ్రంపహాడ్):మినీ మేడారం గా వెలుగొందుతున్నఅగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతరలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైధ్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. జాతీయ రహదారిపై ఊరుగొండ, గూడెప్పాడు, కటాక్షపూర్, అక్కంపేట ప్రధాన ఆర్చి వద్ద మెడికల్ ఎమర్జెన్సీ సబ్ సెంటర్ లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సెంటర్స్ ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటాయన్నారు. ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న 22 మినీ మేడారం జాతరలలో వైద్య సేవలు అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్బంగా జాతర సబ్ సెంటర్ లో కరెంటు, గ్రౌండ్ మ్యాట్, టాప్ మ్యాప్, తాగు నీరు లాంటి సౌకర్యాలు కల్పించాలని డాక్టర్ స్పందన ఈవో దృష్టికి తీసుకెళ్లినట్టు జిల్లా వైద్య అధికారికి తెలిపారు. వెంటనే స్పందించిన జిల్లా వైద్యాధికారి సౌకర్యాలు కల్పించాలని ఈవో ను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు ఇస్తున్న చికిత్సలు, మందుల నిల్వలు, రికార్డుల నిర్వహణపై ప్రత్యేకంగా పరిశీలించారు. పరిశుభ్రత, సిబ్బంది హాజరు, ప్రసూతి సేవలు, అత్యవసర సేవల అమలుపై వైద్యాధికారి స్పందనను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని DMHO తెలిపారు.ఈ తనిఖీలో స్పెషల్ ఆఫీసర్ అశోక్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ స్పందన ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
previous post
next post

