Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

దివ్యాంగులకు ఉపకారణాల పంపిణీ

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉపకరణాలను పంపిణీ చేసిన అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖవరంగల్ తూర్పు నియోజకవర్గంలోని దివ్యాంగులకు అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా మంగళవారం ఉదయం పంపిణీ చేశారు.మహిళా, శిశు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సహాయ ఉపకారణాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ దివ్యాంగులు విభిన్న రంగాలలో రాణిస్తున్నారని అన్నారు. ఉన్నత స్థాయిలో ఉన్నారని పేర్కొన్నారు. దివ్యాంగులకు రెట్రో ఫిట్టెడ్ మోటారైజెడ్ వెహికల్స్, బ్యాటరీ వీల్ చైర్స్, హైబ్రిడ్ వీల్ చైర్స్, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిల్స్, లాప్ టాప్స్, 5G స్మార్ట్ ఫోన్స్, మొబైల్ టాబ్స్ వంటి ఉపకారణాలు, పరికరాలను అర్హత కలిగిన దివ్యాంగులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు.అదేవిధంగా వర్ధన్నపేట నియోజక వర్గం పరిధిలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా అర్హత కలిగి ఎంపిక కాబడిన దివ్యాంగులకు సహాయ ఉపకారణాల ప్రొసీడింగ్ కాపీ ని సోమవారం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి బి. రాజమణి, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ అనిరుద్, వర్దన్నపేట సీడీపీఓ దెబోరా, సూపర్వైసర్లు, దివ్యాంగులు పాల్గొన్నారు.

Related posts

నిరుపేదలకు అండగా బి.ఆర్.ఎస్ ప్రభుత్వం

Jaibharath News

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం

పోషక ఆహారంతో సంపూర్ణ ఆరొగ్యం