-భక్తి పారవశ్యం లో అగ్రంపహాడు
-ఆద్యంతం ఉద్విగ్న భరితం
-గద్దెనెక్కిన సారలమ్మ
- పసుపు కుంకుమలు,
- ఘటం, వరాల కుండ లు
వనాన్ని గద్దెలకు తెచ్చిన పూజారులు
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు న్యూస్)మినీ మేడారం గా వెలుగొందుతున్న అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతర మహా ఘట్టం బుధవారం మొదలైంది. భక్తజన సందోహం మధ్యన ముందుగా పూజారులు సాంప్రదాయ బద్ధకంగా పసుపు కుంకుమలను, ఘటం వరాల కుండలని, వనాన్ని గద్దెలకు తీసుకొచ్చారు. సారలమ్మ పూజారి గుల్లపెల్లి సాంబశివరావు ఇంటి నుండి సారలమ్మను భాజా భజంత్రీలు డప్పు చప్పులు శివసత్తుల పూనకాలు భక్తజన సందోహం మధ్యన గద్దెకు తీసుకొచ్చారు. ఆద్యంతం ఉద్విగ్న భరితం గా ఊరేగింపు జరిగింది. ఎదురుకోళ్లు ఎగురవేసి సారలమ్మ తల్లిని భక్తులు పొర్లుదండాలు పెట్టి అమ్మవారిని దర్శించుకున్నారు. దీంతో భక్తి పారవశ్య లో భక్తులు మునిగితేలారు. భక్తులు ఉదయం నుండి సాయంత్రం వరకు కొబ్బరికాయలు పసుపు కుంకుమలు నిలువెత్తు బంగారంతో వనదేవతలను దర్శించుకున్నారు. లక్షలాది మంది భక్తులు అగ్రం పహాడ్ పరిసరాల లో విడిది చేశారు. వివిధ వాహనాల లో చేరుకున్నారు. కాలినడకన భక్తు తరలి వచ్చారు. వివిధశాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.


జాతరలో విస్తృతంగా వైద్య సేవలు:
ఈసారి జాతరలో ఆత్మకూర్ మండల వైద్యాధికారి డాక్టర్ స్పందన నేతృత్వంలో సుమారు 50 మంది వైద్య బృందం సేవలందిస్తున్నారు. జాతరలో సంరక్ష ఆసుపత్రి వారు భక్తుల కోసం ఉచితంగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. పోలీస్ శాఖ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి విస్తృతంగా సేవలందిస్తున్నారు. జాతర ప్రత్యేక అధికారి ఆర్డీవో నారాయణ తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి. ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు భక్తులకు సేవలు అందిస్తున్నారు. జాతరలో మార్కెట్ చైర్మన్ బీరం సునంద సుధాకర్ రెడ్డి మాజీ చైర్మన్ బోరిగం స్వామి , ప్రస్తుత చైర్మన్ వంచ రంగారెడ్డి, అగ్రంపహాడు సర్పంచ్ గంగుల మహేందర్ ఈవో నాగేశ్వరరావు జాతరలో విస్తృతంగా పర్యవేక్షిస్తున్నారు.

