Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

సమ్మక్క ఆగమనం తో ఎగిసిపడ్డ భక్తజనం

సమ్మక్క ఆగమనం తో ఎగిసిపడ్డ భక్తజనం
అగ్రంపహాడు నుంచి
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)మినీ మేడారంగా వెలుగొందుతున్న ఆత్మకూరు మండలం ఆగ్గంపహాడు జాతరలో ప్రధాన ఘట్టమైన సమ్మక్కను తీసుకువచ్చే కార్యక్రమం గురువారం అగ్రంపహాడు నుండి మొదలుకాగానే భక్త జనం ఉవ్వెత్తున ఎగిసిపడింది సమ్మక్క రాక సందర్భంగా మహిళలు, శివశక్తుల పూనకాలతో మారు మోగింది .దారి లోభక్తులు ఎదురుపడి సాగిలపడి మోకరిల్లారు తల్లి సమ్మక్క తల్లి సారక్క అంటూ మహిళలు సమ్మక్కకు స్వాగతం పలికారు లక్షలాదిమంది సమ్మక్క రాక కోసం అగ్రంపహాడ్ జాతరలో విడిది చేశారు అగ్రం పహాడ్ జాతరకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కాక హైదరాబాద్ ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలివచ్చారు సమ్మక్క దేవత గద్దెనెక్కడంతో భక్తుల మొక్కులు చెల్లించుకోవడం మొదలుపెట్టారు -అధికారుల లాంఛనాలు
వనదేవతలైన సమ్మక్కసారలమ్మ జాతర లో భాగంగా ప్రభుత్వ అధికారుల లాంఛనాల ఏర్పాటు చేశారు. అందు లో భాగంగా పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, ఆహ్వానం పలికారు. ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్ తుపాకిని పేల్చి తల్లికి స్వాగతం పలికారు. పూజారులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి భారీ పోలీస్ బందోబస్త్ మధ్య సమ్మక్క తల్లిని గద్దెకు తీసుకు వచ్చారు.. సమ్మక్క వస్తున్నారని భక్తులు ఒకేసారి లక్షలాదిమంది అమ్మవార్లకు ఎదురుగా వెళ్తూ ఎదురుకోళ్ళను ఎగుర వేశారు కొబ్బరికాయలను కొట్టారు. పూలను చల్లుతూ సమ్మక్కకు ఎదురేగి స్వాగతం పలికారు . పూజారులను తాకే ఎందుకు భక్తులు ఎగసి పడ్డారు. మహిళలు పూనకం తో సాగి ల పడ్డారు. భక్తులు ముందుకు రావడంతో రోప్ పార్టీ పోలీస్ బృందాలకు భక్తుల మధ్య తోపులాట జరిగింది. అశేష భక్త జనం మధ్య అధికారులు పోలీసులు సమ్మక్కను తీసుకువచ్చి గద్దె పై నిలిపారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ వంచ రాజీ రెడ్డి, సర్పంచ్ గంగుల మహేందర్, మాజీ చైర్మన్ బోరిగం స్వామి, ఈ ఓ నాగేశ్వర్ రావు, మార్కెట్ చైర్మన్ బీరం సునంద సుధాకర్ రెడ్డి,
సి ఐ సంతోష్, పాల్గొన్నారు

Related posts

భక్తజనంతో కిటకిటలాడిన అగ్రంపహాడు జాతర -కిక్కిరిసిపోయిన క్యూలైన్లు

Jaibharath News

ఇచ్చిన మాటకు కట్టుబడి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాము

ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పరీక్షలు ప్రారంభం!