Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

భక్తజన గుడారం అగ్రంపహాడు

భక్తజన గుడారం అగ్రంపహాడు
(అగ్రంపహాడు నుంచి
జై భారత్ వాయిస్ ప్రతినిధి):
మేడారం తర్వాత స్థాయిలో జరుగుతున్న ఆత్మకూరు మండలం అగ్రంపహాడు జాతరలో సమ్మక్క సారలమ్మ లు గద్దెకు చేరడంతో భక్తజన గుడారంగా మారింది సమ్మక్క సారలమ్మలు గద్దెకు చేరడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు హనుమకొండ వరంగల్ హైదరాబాద్ వంటి నగరాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి అగ్రంపహాడు కు తరలివచ్చారు తల్లులను దర్శించుకునేందుకు బారులు తీరి మొక్కులు సమర్పించారు వచ్చే జాతర వరకు తమ పిల్లాపాపలను చల్లంగా చూడాలని బెల్లం బంగారం కొబ్బరికాయలను సమర్పించారు సమ్మక్క సారలమ్మలను వేడుకున్నారు కోరిన కోర్కెలు ఈడేర్చే తల్లులకు భక్తులు ఎదురుకోళ్లను సమర్పించారు. దేవాదాయ శాఖ సిబ్బంది, నిర్లక్ష్యం క్యూలైన్లు సరిగా లేకపోవడంతో మహిళలు పిల్లలు అనేక అవస్థలు పడ్డారు . బయటకు వెళ్లే దారి ఇరుకుగా ఉండడంతో సరిగా లేకపోవడంతో భక్తులు అనేక అవస్థలు పడ్డారు. జాతర ఈవో నాగేశ్వరరావు సిఐ సంతోష్ ఏసీపి సతీష్ బాబు క్యూలైన్ల వద్ద ఉండే భక్తులను ఇబ్బందులను నివారించేందుకు కృషి చేశారు భక్తులు గద్దె పై అమ్మలపై బెల్లాన్ని కొబ్బరికాయలను విసిరి వేయడంతో అక్కడ వాలంటీర్లు ఇబ్బంది పడ్డారు సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న భక్తులు బయటికి వెళ్లేందుకు దారి ఇరుకుగా ఉండడంతో మహిళల పిల్లలు అనేక ఇక్కట్లు పడ్డారు ఇంకా ఈ జాతరలో కమిటీ చైర్మన్ వంచరాజిరెడ్డి స్థానిక సర్పంచ్ గంగుల మహేందర్ మాజీ చైర్మన్ బొరీగం స్వామి తదితరులు పర్యవేక్షణ సమీక్షించారు జాతర విద్యుత్ కాంతులతో అలంకార శోభాయమానంగా మారింది భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భక్తులు ఇబ్బందులు పడ్డారు

Related posts

నాలుగు లక్షల రూపాయల నగదు స్వాధీనం..

Jaibharath News

ప్రతి ఒక్కరూ సేవా భావం అలవర్చు

అక్కంపేట ఇక రెవెన్యూ గ్రామం

Jaibharath News