జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
గీసుకొండ మండల కేంద్రానికి చెందిన శ్రీరామోజు సుజాత అనే నిరుపేద మహిళ శుక్రవారం ఉదయం అనారోగ్యంతో మరణించగా, మృతురాలి అంత్యక్రియల ఖర్చుల సహాయార్ధం అదే గ్రామానికి చెందిన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ రూ5000/- ల ఆర్థిక సహాయం పంపి తన మానవత్వం చాటుకున్నారు. సదరు ఆర్థిక సహాయాన్ని గీసుకొండ సోషల్ సర్వీస్ టీం ప్రతినిధి, ప్రభుత్వ ఉపాధ్యాయులు కర్ణకంటి రాంమూర్తి బాధిత కుటుంబానికి అందజేయగా, ఈకార్యక్రమంలో వీరితో పాటు టీం సభ్యులు ముల్క సత్యనారాయణ, కత్తి వెంకటేశ్వర్లు, స్థానిక పెద్దలు పొగాకు కిష్టయ్య, బండారి వెంకటేశ్వర్లు, ముల్క మార్కండేయ, ప్రసాద్ వాజపేయి, కర్ణకంటి గణేష్, కోటిలింగాచారి మరియు తాటికొండ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
next post

