Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ప్రతి ఒక్కరూ సేవా భావం అలవర్చు

(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ)
జన్మదినాలు, వివాహ వార్షికోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాలను సేవా కార్యక్రమాలుగా మలచుకోవడం సమాజానికి ఎంతో అవసరమని ప్రముఖ కవి, రచయిత లయన్. పొట్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. వ్యక్తిగత ఆనందాన్ని సామాజిక బాధ్యతతో ముడిపెట్టి రక్తదానం చేయడం అత్యంత గొప్ప సంప్రదాయమని ఆయన అభిప్రాయపడ్డారు.
చక్రి ఫౌండేషన్ అధ్యక్షురాలు చిట్టిపల్లి దేవిక తన జన్మదినాన్ని పురస్కరించుకొని హనుమకొండలోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో తన మిత్రులతో కలిసి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన జన్మదినాన్ని సేవా కార్యక్రమంగా నిర్వహించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని, రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం లభించడం గర్వకారణమని తెలిపారు. హనుమకొండ  సర్క్యూట్ హౌస్ వద్ద ఉన్న స్పందన దివ్యాంగుల మరియు బధితుల కేంద్రంలో పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ రక్తదాన ప్రాముఖ్యతను వివరించారు.ఒక దాత ఇచ్చిన రక్తం ద్వారా ముగ్గురు ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. రక్తం దానం చేయడం వల్ల శరీరానికి ఎలాంటి హానీ ఉండదు. దానం చేసిన రక్తం కేవలం 21 రోజులలోనే పునరుత్పత్తి అవుతుంది. ఆరోగ్యవంతులు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలి. రక్తానికి ప్రత్యామ్నాయం రక్తమే. అత్యవసర సమయాల్లో రక్తాభావం వల్ల ఎవ్వరూ ప్రాణాలు కోల్పోకూడదంటే సమాజంలో రక్తదానంపై అవగాహన మరింత పెరగాలి” అని ఆయన అన్నారు.
అదేవిధంగా యువత ఈ తరహా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని, జన్మదినాలను ఖర్చులు, ఆర్భాటాలకే పరిమితం చేయకుండా మానవత్వాన్ని చాటే కార్యక్రమాలకు అంకితం చేయాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో సంస్థ కోశాధికారి కటుకోజు రమేష్, స్వప్న, విజయ క్రాంతి కుమార్, నరేష్ తదితరులు పాల్గొని రక్తదాతలను అభినందించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ రెడ్ క్రాస్ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

ఆత్మకూరు లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Jaibharath News

భద్రకాళి చెరువు పూడికతీత పనులకు దేనికి ఎంత ఖర్చవుతుంది

బాల్యం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి

Jaibharath News