April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనకాపల్లి

ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి పదకొండవ తేదీన జరగనున్న పురపాలక ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రముఖ సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్  ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓటు అనేది ప్రజాస్వామ్యానికి బలమైన ఆయుధమని, ప్రతి ఓటరు దాని ప్రాముఖ్యతను గుర్తించి బాధ్యతతో ఓటు వేయాలని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిడులకు లొంగకుండా, నగర అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజాసేవకు నిబద్ధత కలిగిన అభ్యర్థినే ఎన్నుకోవాలని సూచించారు.పురపాలక ఎన్నికలు నగర భవిష్యత్తును నిర్ణయించే కీలకమైనవని, రోడ్లు, పారిశుధ్యం, తాగునీరు, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధి ఓటర్ల చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు. ప్రతి ఓటు విలువైనదని, ఓటు వేయకపోతే ప్రజాస్వామ్యానికి నష్టం కలుగుతుందని తెలిపారు.

Related posts

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

What’s The Difference Between Vegan And Vegetarian?

Jaibharath News

What You May Have Missed at the Alley 33 Fashion Event

Jaibharath News