జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
ఖిలా వరంగల్ మండలం బొల్లికుంటలోని ఇ.యస్.కె. మార్క్ ఇండస్ట్రీస్ ఇటుక బట్టీలో రెస్క్యూ వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి సాయి కుమార్ నిర్వహించారు.పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రం నుండి వచ్చిన వలస కార్మికులు శ్రమ దోపిడికి గురవుతున్న విషయాన్ని కనీస అవసరాలు కల్పించకుండా ఉండటాన్ని న్యాయమూర్తి స్వయంగా గుర్తించి, వారికి విముక్తి కల్పించి, స్వంత రాష్ట్రమైనటువంటి ఒడిశా రాష్ట్రానికి పంపించేలా ఏర్పాట్లు చేయాలని అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ లేబర్ ను ఆదేశించారు.ఎనిమిది మంది వలస కార్మికులు అతి దయనీయ స్థితిలో పని చేయడాన్ని గమనించారు. వారి పని వేళలు, వారికి అందుతున్న సౌకర్యాలు, వేతనాల గురించి ఆరా తీయగా.. వారు తీవ్రమైన శ్రమ దోపిడికి గురవుతున్నట్లు వెల్లడైంది.దీంతో తక్షణమే స్పందించిన న్యాయమూర్తి, సంబంధిత అధికారులను పిలిపించి కార్మికుల పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు రావలసిన బకాయిలు చెల్లించేలా ఆదేశించడమే కాకుండా, వారు గౌరవప్రదంగా తమ స్వంత రాష్ట్రానికి చేరుకునేలా రవాణా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.న్యాయమూర్తి చొరవతో వెట్టి చాకిరి నుండి బయటపడిన కార్మికులు, తమను ఆదుకుని స్వస్థలాలకు పంపిస్తున్నందుకు న్యాయస్థానానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవ్యవస్థ పేదలకు, బాధితులకు అండగా ఉంటుందని ఈ ఘటన మరోసారి నిరూపించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వినోద, మామునూరు సబ్ ఇన్స్పెక్టర్ టి.శ్రీకాంత్, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఆర్.సురేష్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ కరుణాకర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు, కార్మికులు, ఇటుక బట్టీ నిర్వాహకుడు శివకృష్ణన్, పారా లీగల్ వాలంటీర్ హనుకాంత్ పాల్గొన్నారు. అంతేకాకుండా ఇటుక బట్టి నిర్వాహకుడి లైసెన్స్ రద్దు చేయాలంటూ లేబర్ ఆఫీసర్ ను ఆదేశించారు.


