- రాయకుంట చెరువుకు జలకళ
- – 14 వందల ఎకరాల ఆయకట్టు రైతులకు పంట సాగు చేసుకునే అవకాశం
- సర్పంచి పర్వతగిరి మహేశ్వరి రాజు ప్రయత్నం
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు న్యూస్) - రాయకుంట చెరువుకు వర్షం పెద్ద చెరువు నుండి నీరు వచ్చే కాలువ 30 ఏళ్లుగా మూతపడడంతో ఆయకట్టు రైతులు పడుతున్న ఇబ్బందులను చూసిన సర్పంచి పర్వతగిరి మహేశ్వరి రాజు ఆత్మకూరు పెద్ద చెరువు నుంచి నీటిని విడుదల చేశారు. శుక్రవారం పెద్ద చెరువు నుంచి రాయకుంటకు వచ్చే ప్రధాన కాలువను పేరుకపోయిన చెత్తాచెదారాన్ని, చెట్లను తొలగించి పెద్ద చెరువు నుండి ఊరు వరకు కాలువను తీసి ఊరు మధ్య కాలువ ను కలిపారు. ఉదయం రైతులతో కలిసి ఆత్మకూరు పెద్ద చెరువు తూం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి రైతుల కోసం తూము తెరిచి నీటిని సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రాయకుంట చెరువు గత 30 సంవత్సరాల నుంచి పెద్ద చెరువు కాలువ నుండి వచ్చే నీరు రాకపోవడంతో ఆయకట్టు రైతులకు పంటలు సరిగా పండక అవస్థలు పడుతున్నారు. రైతులు తమ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే రైతాంగ సంక్షేమ దృష్టిలో పెట్టుకొని వెంటనే కాలువను మరమ్మతులు చేయించి తూము ద్వారా రాయ కుంటల చర్లకు నీటిని విడుదల చేశామన్నారు. దీనితో ఆయకట్ట రైతులు రబీ పంటను సాగు చేసుకోవచ్చని చెప్పారు .రైతుల ఆనందం కోసం ఏమైనా చేస్తామన్నారు. గెలిచిన వెంటనే రైతాంగానికి ఇచ్చిన హామీని నెరవేర్చమని అలాగే ఆత్మకూరును ఆదర్శంగా అభివృద్ధి చేసేందుకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి అండదండలతో ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని సర్పంచ్ అన్నారు. తమ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందించి అండగా నిలుస్తున్నామన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వం నుంచి అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతామన్నారు. ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా ఏ అవసరం ఉన్నా మా దృష్టికి తీసుకువచ్చిన వెంటనే సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు అన్నారు. ఇప్పటికే జాతీయ రహదారిపై సంవత్సర కాలం నుంచి వెలగని విద్యుత్ దీపాలను కొత్త విద్యుత్ దీపాలను అమర్చి వెలిగిస్తున్నామన్నారు. ఆత్మకూరు గ్రామాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సర్పంచ్ అన్నారు.


