Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

శివనామస్మరణతో మారుమోగుతున్న శివాలయాలు

(జై భారత్ వాయిస్ న్యూస్. ఆత్మకూర్ న్యూస్)
ఆత్మకూరు మండల కేంద్రంలోని పంచలింగాల మహాదేవాలయం పెంచికలపేట గ్రామంలో శ్రీరామ లింగేశ్వర ఆలయం గ్రామంలోని త్రికోటేశ్వర ఆలయం నీరుకుల్ల గ్రామ చెరువు సమీపంలో శివాలయం, పెద్దాపురం గ్రామంలో నెలకొన్న చిన్న రామప్ప ఆలయాలలోనూ శివనామ స్మరణతో మారు మొగాయి. ఉదయం వేళలో ఆలయాలలో భక్తుల రద్దీనెల కోన్నది. భక్తులు ఆ దేవునికి అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసి మంగళ హారతులు పట్టారు. ఉపవాసాలు నిర్వహించే మహాదేవ శివదేవుని కొలిచారు సాయంత్రం వేళలో భజన కార్యక్రమం నిర్వహించారు.ఆత్మకూరులోని మహాదేవ ఆలయంలో వైభవంగా శివపార్వతుల కల్యాణాన్ని నిర్వహించారు వేదమంత్రోచారణల మధ్య వేద పండితులు భక్త జన సందోహాల మధ్య వేదికపై శివ కళ్యాణాన్ని వైభవపేతంగా నిర్వహించారు. శివపార్వతుల కళ్యాణాన్ని చూసి తరించడానికి పలు గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు తరలివచ్చిన భక్తులకు నిర్వాహకులు తగిన సౌకర్యాలు కల్పించారు. పలు గ్రామాల నుంచి ఆత్మకూరు నుంచి విచ్చేసిన భక్తులు రాత్రిపూట ఉపవాస దీక్షలు జాగరణ చేపట్టారు.

Related posts

రైతు రుణం తీర్చుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. టేస్కాబ్ చైర్మన్ రవీందర్ రావు

పారిశుధ్య కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి

అంగరంగ వైభవంగా మహా పడిపూజ మహోత్సవం