జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం)
తెలంగాణ రాష్ట్రంలో 2025 26 విద్యాసంవత్సరలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు జరగనున్నాయి.హాల్ టికెట్లను ఈనెల 20వ తేదీ తర్వాత నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల రిజిస్టర్ మొబైల్ వాట్సాప్ కు పంపించేందుకు ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలో 1495 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా ఈ పరీక్ష కేంద్రాలలో 996,529 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇంటర్మీడియట్ బోర్డులోవిద్యార్థుల తల్లిదండ్రులు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కు వాట్సప్ కు హాల్ టికెట్లు పంపించిన తర్వాత నేరుగా డౌన్లోడ్ చేసుకున్. ఏర్పాటు చేస్తున్నారు ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్ నుంచి కూడా నేరుగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశాలు కల్పిస్తున్నారు. హాల్ టికెట్ పై కళాశాల ప్రిన్సిపాల్ సంతకం లేకున్నా పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఇవ్వనున్నారు. ఈసారి హాల్ టికెట్ పై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని పరీక్ష కేంద్రం వివరాలు రూట్ మ్యాప్ క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
previous post

