(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు) హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని నీరుకుల్ల శివారులో నెలకొన్న శ్రీ సిద్ధ లింగేశ్వర దేవాలయ నిర్మాణానికి శుక్రవారం గ్రామస్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో భూమి పూజ నిర్వహించారు. రెండేళ్ల కింద మహా శివ రాత్రి సందర్భంగా భూమిలో నుంచి వెలువడ్డ సిద్ధ లింగేశ్వరునికి తాత్కాలికంగా షెడ్డు వేసి నీడ కల్పించారు గత రెండు సంవత్సరాల కింద భూమి లోపల నుండి పైకి తేలి గ్రామస్తుల కొందరికి కనబడడంతో వెన్నపురెడ్డి రాజి రెడ్డి ,మాజీ ఎంపీ టి శంకర్ ఆధ్వర్యం లో సిద్ధ లింగేశ్వర ని పైకి తీసి పూజలు నిర్వహించారు అప్పుడు జై భారత్ వాయిస్ వెలుగులోకి తెచ్చింది. అప్పటినుంచి ప్రధాన రహదారి పక్కన తాత్కాలికంగా షెడ్డు వేసి పూజలు నిర్వహిస్తున్నారు గ్రామ పుర ప్రముఖులు మాజీ సొసైటీ చైర్మన్ కడారి రఘునాధ రావు ఆధ్వర్యంలో భూమి పూజ ను చేపట్టారు వేద పురోహితులు కొమ్మనపల్లి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో పురోహితులు ఉప్పునూతల బ్రహ్మచారి వడ్డెవరం గోపి వడ్డేవరం బాబు వేదమంత్రోచారణల మధ్య శిలాన్యాసం నిర్వహించారు ఈ శిలాన్యాస కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ కడారి రఘునాథరావు బొంపెల్లి రాజు ఆలయ కమిటీ చైర్మన్ వెన్నపురెడ్డి రాజిరెడ్డి తాటిపర్తి మోహన్ రావు ,సర్పంచ్ తడక నీరజ శ్రీనివాసు ,తాటిపర్తి కిషన్ రావు మాజీ ఎంపీటీసీ మానగాని శంకర్ ,మాజీ సర్పంచులు ఉడుత సంగీత మహేందర్ ఆర్షం బలరాం దగ్గు సమ్మరావు తాడిపర్తి కిషన్ రావు యువత యువజన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.శిలన్యాస సందర్భంగా గ్రామస్తులు సిద్ధలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విరాళాలు అందించి తోడ్పడాలి
శ్రీ సిద్ధలిగేశ్వరునికి భూమి పూజ అనంతరము జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మానగాని శంకర్ మాట్లాడుతూ శ్రీసిద్ధ లింగేశ్వర ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని చెప్పారు గతంలో మాజీ ఇంజనీరు కడారి నవనీతరావు కడారి రఘునాథరావు లు ఇచ్చిన విరాళాలతో దేవాలయానికి భూమిని కొనుగోలు చేశారని ఆయన చెప్పారు ఇంకా దేవాలయ నిర్మాణానికి తాటిపర్తి కిషన్ రావు ఐదు లక్షలు విరాళాన్ని అందించారని చెప్పారు కడారి నవనీత రావు కడారి రఘునాథరావు లు దేవాలయ నిర్మాణానికి నిధులు వెచ్చేస్తున్నారని ఆయన చెప్పారు గ్రామస్తులు తమకు తోచినంత విరాళాన్ని అందించి దేవాలయాన్ని నిర్మాణానికి తోడ్పడాలని ఆయన కోరారు అనంతరము వేద పురోహితులు కొమ్మనపల్లి సంపత్ రావు ఉపునూతల బ్రహ్మచారి తదితరులను సత్కరించారు




