జై భారత్ వాయిస్ దామెర
దామెర మండలంలో ఒగ్లాపూర్ లో శ్రావణ మాసం పురస్కరించుకుని పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఒగ్లాపూర్ సర్పంచ్ కేతిపెల్లి సరోజనవీరారెడ్డి ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగను ఎంతో కన్నుల పండువలా నిర్వహించారు. ఇందులో భాగంగా డప్పు చప్పుళ్ల నడుమ మహిళలు తలపై బోనం ఎత్తుకుని వరుస క్రమంలో పోచమ్మ దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ నేపథ్యంలో మహిళలు పోచమ్మ తల్లికి కొబ్బరి కాయలు కొట్టి, పసుపు, కుంకుమలు సమర్పించారు. ఆచార, సాంప్రదాయ రీతిలో నైవేధ్యం, పడులు పెట్టి తమను చల్లగా చూడాలని మొక్కులు సమర్పించారు. అనంతరం పోచమ్మ తల్లి అమ్మ వారికి గొర్రె పోతులను, కోళ్లను బలి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కేతిపెల్లి సరోజనవీరారెడ్డి, గ్రామాభివృద్ధి చైర్మన్ కేతిపెల్లి శ్రీధర్రెడ్డి, ఎంపీటీసీ దుబాసి శ్రీలతరాధాకృష్ణ, రెడ్డి సంఘం పెద్దలు మన్నెం సాంబరెడ్డి, మన్నెం రమణారెడ్డి, మన్నెం ఇంద్రారెడ్డి, వంచ రవీందర్ రెడ్డి, మన్నెం రవీందర్రెడ్డి, గోగుల సమ్మిరెడ్డి, మన్నెం రఘ పతిరెడ్డి, గోగుల రాజేందర్రెడ్డి, కేతిపెల్లి మోహన్ రెడ్డి మన్నెం నిరంజన్ రెడ్డి, పిల్లలు, పెద్దలు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు.

previous post
next post