Jaibharathvoice news హనుమకొండ: ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.మంగళవారం హనుమకొండ జిల్లా దామెర లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ ప్రత్యేక వైద్య శిబిరంలో స్త్రీలు, జనరల్ మెడిసిన్, ఎముకలు కీళ్లు, కంటి, దంత, పిల్లల వైద్య నిపుణులు పాల్గొని వైద్య సేవలను అందించారు. వైద్య శిబిరంలో వైద్యులు ప్రజలకు ఉచిత సేవలు అందిస్తుండగా ఓపి విభాగం తదితర సేవలను కలెక్టర్ పరిశీలించారు. 375 మంది కీ వైద్య పరీక్షలు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓపి నమోదు, ఫార్మసీ, షోరూం లని కలెక్టర్ సందర్శించారు. ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను గురించి వైద్యులు సిబ్బందిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 99 రోజుల కార్యచరణ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక వైద్యులతో వైద్య శిబిరం ఏర్పాట చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య, పరకాల ఆర్డిఓ డాక్టర్ కన్నం నారాయణ, దామెర తహసిల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి, స్థానిక సర్పంచ్ కల్పన, వైద్యాధికారులు డాక్టర్ మహేంద్ర, డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ శాంతి ప్రియ, డాక్టర్ ఎస్ కే జాస్మిన్ మెహర, డాక్టర్ ప్రమోద్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


