Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కాంగ్రెస్ ప్రభుత్వం పాలన వైఫల్యం

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ )
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైనందుకు నిరసిస్తూ గీసుగొండ బీజేపీ మండల అధ్యక్షులు కొంగర రవికుమార్ ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం సిబ్బందికీబీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షులు దొంతి దేవేందర్ రెడ్డి  మాట్లాడుతూ*, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రైతు భరోసా, పెన్షన్లు, నిరుద్యోగ భృతి, కల్యాణ లక్ష్మి వంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదని విమర్శించారు. పెట్టుబడి సాయం అందక రైతులు అప్పులపాలవుతున్నారని, ఆసరా పెన్షన్ల కోసం అర్హులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, వెంటనే ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కూతురు రాజు, రాధారాపు శివకుమార్, జిల్లా కౌన్సిల్ మెంబర్లు బిల్లా రమేష్, గోదాసి అశ్విన్ కుమార్,15,16 డివిజన్ అధ్యక్షులు ల్యాదెళ్ల ప్రభాకర్, జంగిలి ప్రసన్న, రాం ప్రసాద్, జనరల్ సెక్రెటరీలు కందికొండ ప్రదీప్, సంతకాల శ్రీనివాస్,రంజిత్,  వెంకటేష్, అల్లం కేదారి, ఉపాధ్యక్షులు మహిళా మోర్చా అధ్యక్షులు బందెల రేణుక సొసైటీ డైరెక్టర్ లే  కపల్లి స్వామి శక్తి కేంద్ర ఇంచార్జ్ పిల్లల రవీందర్ గౌడ్ భూత్ అధ్యక్షులు నారెళ్ళ రాములు జల్లా నాగరాజు అన్వేష్ తదితరునాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Related posts

విద్యార్థులు ఇష్టపడి చదవాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

దేవాలయాల ప్రతిష్టాపన కార్యక్రమాలలో పాల్గొన్న కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

గీసుకొండలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి జన్మదిన వేడుకలు