జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం లోని గంగాదేవిపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఆదర్శ గ్రామ ప్రదాత, మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి మరణం తీరని లోటని బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేర్కొన్నారు. రాజమౌళి మరణవార్త తెలిసిన వెంటనే ప్రేమేందర్ రెడ్డి వారి నివాసానికి చేరుకుని, రాజమౌళి చిత్రపటానికినివాళులర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గ్రామ అభివృద్ధి కోసం రాజమౌళి చేసిన కృషి చిరస్మరణీయమని ఈ సందర్భంగా వారు కొనియాడారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గటికొప్పుల రాంబాబు,బీజేపీ గీసుగొండ మండల అధ్యక్షులు కొంగర రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షులు కూతురు రాజు, రాధారపు శివకుమార్, నాయకులు కోట ఏలియా, రవి వర్మ, మడిశెట్టి రాము మరియు పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
previous post

