Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

నల్లబెల్లిలో ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ

( జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్)
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం మహిళ సోదరీమణులకు ప్రభుత్వం అందించే ఈద్ ముబారక్ తోఫా కిట్లను గ్రామ సర్పంచ్ గ్రామ సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అనిత శ్రీకాంత్ మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసం అనేది ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించి ఉపవాస దీక్షలతో క్రమశిక్షణగా దాతృత్వం ధార్మిక చింతనల కలయికతో పవిత్ర రంజాన్  మాసాన్ని కొనసాగిస్తూ ఆధ్యాత్మిక భావనలతో ఇతరులకు సహాయం చేయాలనే సంకల్పంతో ఉపవాస దీక్షలు సాగుతాయని అన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వం మైనార్టీలకు అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మేకల దేవేందర్, వార్డు సభ్యులు మహమ్మద్ జమీలభి, మైనార్టీ సంఘం అధ్యక్షులు మహమ్మద్ జాఫర్ మియా, రఫిక్, పాషా తదితరులు పాల్గొన్నారు

Related posts

పాంచాల రాయలస్వామిని దర్శించుకున్నా బీజేపీ నేతలు

Jaibharath News

అక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్నది అవాస్తవం*

ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలలో దివ్యగులకు ప్రాధాన్యత.. జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

Jaibharath News