April 9, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ స్పీకర్

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు )
ఆత్మకూరు మండలం లోని పలు గ్రామాల్లో రంజాన్ పండుగను ముస్లిం లు ఘనంగా జరుపుకున్నారు.మండలంలోని గూడెప్పాడు గ్రామంలో రంజాన్ సందర్భంగా మాజీ కో ఆప్షన్ సభ్యులు బాబు మియా (చిరు) నిర్వహించిన కార్యక్రమం లో మాజీ స్పీకర్, శాసనసభ పక్ష నేత సిరికొండ మధుసూదనా చారి, రాష్ట్ర పెస్టిసైడ్ డీలర్ల దుకాణాల సంఘం అధ్యక్షుడు నాగూర్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ పండుగ మానవాళికి శాంతి, ప్రేమ, త్యాగ నీ రతిని చాటి చెప్తుందని అన్నారు. ముస్లిం సోదరులు నెల రోజులపాటు భక్తిశ్రద్ధలతో ఆచరించిన ఉపవాస దీక్షలను సమాజంలో క్రమశిక్షణ పేదలకు చేసి ధన ధర్మాలను, సామాజిక సమానత్వాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. సమాజంలో శాంతి సౌభాగ్యాలు చేకూరాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లు వారు తెలిపారు.ముస్లిం సోదర సోదరీమణులకు ఎంతో పవిత్రమైనదని,ఈ పవిత్ర నెల మనందరికీ సామరస్యాన్ని, సోదరభావాన్ని పెంపొందించే సందేశాన్ని అందిస్తుందని తెలిపారు. మత భేదాలు లేకుండా కలిసికట్టుగా జీవించడం ద్వారా సమాజంలో శాంతి, అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమంకారుల ఫోరం జిల్లా కార్యదర్శి ఇర్సడ్ల సదానందం, ముస్లిం లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతరకు తరలివస్తున్న భక్తులు

మత్తు పదార్థాల నియంత్రణకై డ్రగ్స్ టీంను ఏర్పాటువరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

ఆత్మకూరు తాపీ మేస్త్రిల సంఘం అధ్యక్షులు గా మంద రవి