Jaibharathvoice.com | Telugu News App In Telangana
ములుగు జిల్లా

పేద విద్యార్థులకు మల్లంపల్లి మండల రెవెన్యూ ఉద్యోగుల చేయూత

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):
ములుగు జిల్లా మల్లంపల్లి మండల పరిధిలోని శ్రీనగర్ మండల ప్రాథమిక పాఠశాలలో చదువుచున్న నిరుపేద పిల్లల రెవెన్యూ ఉద్యోగులు చేయూత అందించారు. తల్లితండ్రులు లేని 4 గురు పిల్లల వివరాలు,వారి కుటుంబ నేపధ్యాన్ని మల్లంపల్లి మండల రెవెన్యూ ఉద్యోగులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొల్లికొండ శ్రీనివాస్, ఎస్కే అఖిల్ పాషా వివరించారు. వారు వెంటనే ఉగాది పండుగను దృష్టిలో ఉంచుకొని స్పందించారు. 15 జతల దుస్తులు, సుమారు రూ.8వేల విలువగలవి కొని ఇవ్వడం జరిగిందని హెచ్ ఎం శ్రీనివాస్ చెప్పారు.
దుస్తులు రెవెన్యూ ఉద్యోగుల ఆదేశం మేరకు విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొల్లికొండ శ్రీనివాస్ తెలిపారు. ఇంకా పిల్లల చదువుల నిమిత్తం మరింత ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ తెలిపారు.

Related posts

కట్టు బొట్టు మన ఆచార సంప్రదాయాలను కాపాడుకోవాలి.

1973-1975 ఇంటర్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

బతుకమ్మ సంబరాల్లో సీతక్క

Jaibharath News