జై భారత్ వాయిస్ )
దర్శి నియోజకవర్గం పరిధిలోని 5 మండలాల ప్రజా సంకల్ప వేదిక సభ్యులు, విద్యా వేత్తలు, వైద్యులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులతో ప్రజా సంకల్ప వేదిక దర్శి అసెంబ్లీ ఇంచార్జి సిద్ది కోటి రెడ్డి, కో ఇంచార్జి గంగి శెట్టి సాయి తేజ ఆధ్వర్యంలో మేలుకో ప్రకాశం పేరుతో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా వేదిక రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది మదిరె రంగ సాయి రెడ్డి హాజరై చట్టాలపై కనీస అవగాహన కల్పిస్తూ వారి సమస్యలను అడిగి తెలుకుని వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. దర్శి ప్రజల ఆకాంక్ష మేరకు అతి త్వరలో దర్శిలో ప్రజా సంకల్ప వేదిక ప్రాంతీయ కార్యాలయాన్ని సబికుల కరతాలా ధ్వనుల మధ్య ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాంత ప్రజలకు అండగా ఉంటానని అతి త్వరలో గడప గడపకు తిరిగి వారి సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేయబోతున్నట్లు ప్రకటించారు. అదే విధంగా ఇటీవల నిర్వహించిన టాలెంట్ టెస్ట్ విజేతలకు పురస్కారాలు ప్రదానం చేశారు. అసెంబ్లీ మొదటి ర్యాంక్ ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి ఏ గీతేంద్ర బాబు, ద్వితీయ ర్యాంక్ వై ఆర్ జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాల విద్యార్థి యానగంటి మల్లికా, తృతీయ ర్యాంక్ వై ఆర్ జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాల విద్యార్థి వి. అభిసిక్త్. దర్శి ప్రజల శ్రేయస్సు కొరకు పాటు పడిన వివిధ వర్గాల వారిని సేవా రత్న అవార్డులతో ఘనంగా సత్కరించారు. అలాగే ప్రజా సంకల్ప వేదిక లో చెరెందుకు ఉత్సహం చూపుతున్న అన్ని వర్గాల ప్రజలు. ఈ కార్యక్రమంలో పెద్దలు yv సుబ్బయ్య, మరియు ఉపాధ్యాయులు, అట్లూరి రామారావు, మీనిగా శ్రీను, నాగేశ్వరరావు, శ్రీశైలం, మరియు నాయకులు బెల్లం గంగారావు
యాన్నబత్తిన శ్రీనివాసులు, సురేష్, నవ్య విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు

previous post