Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

బిఆర్ఎస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ది సాధ్యం: ఎమ్మేల్యే ధర్మా రెడ్డి

జై భారత్ వాయిస్ ఆత్మకూరు):

బిఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు మండలంలోని పెద్దాపురం గ్రామంలో రూ.80లక్షలతో గ్రామంలో పూర్తిచేసిన సిసి రోడ్లతో
పాటు నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభంచేసి మహిళ కమ్యూనిటీ భవనం నిర్మాణ పనులు ప్రారంబోత్సవం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ…బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయని, గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నదని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. ఇతర పార్టీ నాయకులు కూడా గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు.దశలవారీగా అభివృద్ధి పనులను పూర్తి చేసి సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దటానికి కట్టుబడి ఉంటానన్నారు. అభివృద్ధితో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన అందరికీ దక్కేలా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ అన్ని అంశాల్లోనూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నదన్నారు .ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన కొనసాగిస్తున్నామని, ప్రజల్లో బి.ఆర్.ఎస్.ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే అసత్యపు ప్రచారాలు చేస్తున్నా రని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మార్క సుమలత, రజనీకర్, జడ్పీ టి సీ కక్కర్ల రాధిక, రాజు, సర్పంచ్ కమల రాజేశ్వర రావు, పెద్దా పురం సొసైటీ వైస్ చైర్మన్ అంబటి రాజ స్వామి, మార్కెట్ చైర్మన్ రాధా రవి యాదవ్, రైతు బందు కమిటీ కన్వీనర్ రవీందర్, మండల బి అర్ ఎస్ అధ్యక్షుడు లేతా కుల సంజీవ రెడ్డి, ప్రధాకార్యదర్శి బొల్లోజు కుమారస్వామి, రైతు బందు కమిటీ సభ్యులు రాయ రాకుల రవీందర్, పద్మ శాలి సంఘం అధ్యక్షుడు వేముల నవీన్, ఎం డి ఓ శ్రీనివాస్ రెడ్డి, ఎం పీ ఈ ఓ సి చేతన్ రెడ్డి, తదితరులు లతో పాటు ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

పులుకుర్తి లోశ్రీ భక్తాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ

యోగా మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది! వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య అనుమంతు!!

సీజనల్ వ్యాధుల చికిత్సలో ప్రైవేట్ ఆస్పత్రులు బాధ్యతగా వ్యవహరించాలి