జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్)
భారతీయ స్టేట్ బ్యాంకు – గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగులకు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్న సంస్థ డైరెక్టర్ బాస.రవి తెలిపారు.అభ్యర్థులు వరంగల్ రూరల్, హనుమకొండ ,(Prof జయశంకర్) భూపాలపల్లి, జనగాం, ములుగు మహబూబాబాద్ జిల్లాల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.నిరుద్యోగ యువకులకు గొప్ప సదవకాశమని
మొబైల్ రిపేరింగ్ ,బైక్ మెకానిక్,ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ, సీసీటీవీ ఇన్స్టలేషన్,ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అభ్యర్థుల యొక్క అర్హతలు
వయోపరిమితి 18-50 లోపు ఉండాలని తెలుగులో చదవటం రాయటం వచ్చిఉండవలెను.. చదువు కొనసాగిస్తున్న విద్యార్థులు అర్హులు కాదు
తెలుపు రేషన్ కార్డ్ కలిగి వుoడవలెను.ఆసక్తి గల అభ్యర్థులు 4 పాస్స్ పోర్ట్ సైజు ఫోటోలు, రేషన్ కార్డ్, ఆధార్ కార్దు విద్యార్హత జిరాక్స్ కాపీలను తీసుకోని భారతీయ స్టేట్ బ్యాంకు – గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (SBI RSETI)సంస్కృతి విహార్ T T D C , హసన్ పర్తి, వరంగల్ జిల్లా – 506 371, ఆడ్రస్ లో ఏప్రిల్ 5వ తేదీ లోపు పేర్లు నమోదు చేసుకోగలరు. శిక్షణ కార్యక్రమం ఆరవ తేదీ నుండి ప్రారంబమగుతుందని తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం మరియు వసతి సదుపాయం కల్పిచబడును. కోర్స్ సంబందిoచిన మెటీరియల్ కూడా ఉచితంగా ఇవ్వబడును. శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు యోగ్యతా పత్రం (సర్టిఫికేట్) ఇవ్వబడును. మరిన్ని వివరాలకు, 9849307873,97040 56522, 6281260878, 9949108934. నంబర్లనుసంప్రదించగలరు. మున్సిపాలిటీ నివాస ప్రాంతము అయినటువంటి అభ్యర్తులు అనర్హులు.( అర్బన్ లో ఉన్న గ్రామీణ ప్రాంతం గ్రామా పంచాయతీ పరిధిలో ఉన్న వారు మాత్రమే అర్హులని ఆయన తెలిపారు

