జై భారత్ వాయిస్ న్యూస్ విజయవాడ)
ఇతర రాష్ట్రాలతో పాల్చుకుంటే కూటమి ప్రబుత్వం అధికారంలో ఉన్న ఏపీలో పెట్రోల్,డిజిల్,గ్యాస్ లకు ఏవిధమైన కొరత లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడ కానూరులో సివిల్ సప్లైస్ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్,డీజిల్,పెట్రోల్ సరఫరా లో కొరతలేదని ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.గ్యాస్,డీజిల్, పెట్రోల్ సరఫరా లపై అనేక అసత్యాలు ప్రచారం చేస్తున్నారని,ప్రతి రోజూ సరఫరా,డిమాండ్ పై డీలర్లు,అధికారులతో సమీక్షిస్తున్నామన్నారు. సరఫరా విషయంలో ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేదని,వదంతుల వల్ల ఐదు లక్షల బుకింగ్ లు ఒకేసారి జరగడంతో స్వల్ప బ్యాక్ లాగ్ ఏర్పడిందని, ప్రస్తుతం 2,70,000 సిలిండర్లను ఎలాంటి ఆటంకాలు లేకుండా సరఫరా చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్బన్ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు గడవకముందే సిలిండర్ రీ-బుకింగ్ చేయడం సాధ్యపడదన్నారు. వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని,ఆన్ లైన్ బుకింగ్ ద్వారానే కేవలం ఓటీపీతో ఇంటి వద్దకే సిలిండర్ డెలివరీ చేస్తున్నామన్నారు.ఏమైనా ఫిర్యాదుల కోసం 1967 కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చు అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,510 రిటైల్ అవుట్‌లెట్లలో కేవలం 4 చోట్ల మాత్రమే సరఫరాలో లో కొంత ఇబ్బంది ఉందని,ఇది కేవలం ఆ డీలర్ల వ్యక్తిగత క్రెడిట్ సమస్యల వల్లే తప్ప,సరఫరా చైన్ లోపం కాదు అని అన్నారు. రాష్ట్రంలో రోజువారీ సగటు వినియోగం పెట్రోల్ 7,900 కిలో లీటర్లు, డీజిల్ 20,000 కిలో లీటర్లు ఉండగా, ప్రస్తుతం డీజిల్ సరఫరాను 8%, పెట్రోల్‌ను 2.4% అదనంగా పెంచడం జరిగిందన్నారు.ప్రజలు ఆందోళనతో ఫుల్ ట్యాంకులు చేయించుకోవాల్సిన అవసరం లేదు అని,తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు.నాన్-డొమెస్టిక్ (కమర్షియల్) సిలిండర్ల కోటాను కేంద్ర ప్రభుత్వం 10% నుండి 70% కి పెంచిందని, దీనివల్ల హోటళ్లు, రెస్టారెంట్లు మరియు ఆసుపత్రులకు మరింత గ్యాస్ అందుబాటులోకి వస్తుందన్నారు. బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలు చేస్తున్న 146 గ్యాస్ ఏజెన్సీలపై 6A కేసులు నమోదు చేసి, 4,285 సిలిండర్లను సీజ్ చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు,డీలర్ల అసోసియేషన్లతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ సరఫరాను పర్యవేక్షిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. మూడు ఆయిల్ కంపెనీలతో ప్రతిరోజూ మాట్లాడి గ్యాస్ ఇబ్బందులు లేకుండా చేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా ఎటువంటి కొరత లేకుండా చూస్తున్నామన్నారు. ప్రజలు కూడా ఏజెన్సీలు, గోడౌన్ల వద్దకు వెళ్లి హడావుడి చేయవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. డేటా షెరింగ్ ప్రతిరోజూ రెండుసార్లు జరుగుతుందని, ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలించి ప్రజలకు ఆటంకం లేకుండా చేస్తున్నామన్నారు. గల్ప్ లో జరుగుతున్న యుద్ధం వల్ల వచ్చే ఇభ్బందులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్యాస్ పైప్ లైన్ అవకాశం ఉన్న ప్రాంతాలలో యల్.పి.జి నుంచి నాచురల్ గ్యాస్ కు మారాలని కోరుతున్నామన్నారు. మూడు నెలల్లో లక్ష మంది వినియోగదారులను ఈ న్యాచురల్ గ్యాస్ వైపు తీసుకు వచ్చే విధంగా చేస్తున్నామన్నారు. పది లక్షల మందిని ఇటువైపు మళ్లించేలా లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు.దీపం పధకం కింద ఉన్న వారికి అవగాహన కల్పించి పి.ఎం.జీ వైపు మారేలా చేస్తామన్నారు. సోషల్ మీడియా ప్రభావం ద్వారా అనేక వదంతలుతో ప్రజల్లో గందరగోళం నెలకొంటుందని, అటువంటి వాటిని నమ్మవద్దన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇస్తున్నారన్నారు. విజయవాడ, మచిలీపట్నం మెగా గ్యాస్ డిస్టిబ్యూషన్ , చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురంలో థింక్ గ్యాస్ డిస్టిబ్యూషన్, ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాల్లో గోదావరి గ్యాస్ డిస్టిబ్యూషన్, విజయవాడ, కాకినాడ ప్రాంతాల్లో భాగ్యనగర్ గ్యాస్ లు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం పైప్డ్ నేచురల్ గ్యాస్ సరఫరా కు అనుమతి ఇచ్చిందన్నారు. పైపు లైన్లు ఏర్పాటు చేయించుకుని, నేచురల్ గ్యాస్ వైపు వెళ్లే ఆలోచన చేయాలని ప్రజలను కోరుతున్నామన్నారు. యల్.పి.జి వినియోగదారులను పి.ఎం.జీ వైపు మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి మనోహర్ తెలియజేశారు.
previous post

