Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు);
ఆత్మకూరు మండల కేంద్రంలోని జి ఎస్ ఆర్ గార్డెన్ లో దామెర ఆత్మకూరు మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 33 మంది లబ్ధిదారులకు రూ. 33,03,828 విలువగల కళ్యాణ లక్ష్మి చెక్కులు, అలాగే 66 మంది లబ్ధిదారులకు రూ.24 .43 లక్షల విలువగల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదిగడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఇప్పటివరకు పరకాల నియోజకవర్గ వ్యాప్తంగా 2797 మందికి రూ. 28 కోట్ల 24 వేల 452 విలువగల కళ్యాణ లక్ష్మి, 2684 మందికి రూ. 9 కోట్ల 6 లక్షల 7వేల 500 విలువగల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసామన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని, ముఖ్యంగా మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని అన్నారు.

Related posts

కేయూ దూరవిద్యా ప్రవేశాల గడువు సెప్టెంబర్-30సంచాలకులు వల్లూరి రామచంద్రం.

ఆత్మకూరు లో 144 సెక్షన్ అమలు

Jaibharath News

పెద్దపూర్,లింగమడుపల్లి లో బిజెపి నేతలు గడపగడపకు కరపత్రాల పంపిణీ

Jaibharath News