Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

Khelo india tribal sports ఖేలో ఇండియా గిరిజన క్రీడల్లో సత్తా చాటిన తెలంగాణ రెజ్లర్లు.

(జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం)
చత్తీస్గడ్ లో జరుగుతున్న ప్రథమ ఖేలో ఇండియా గిరిజన క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటారు. సర్ గుజలో జరుగుతున్న రెజ్లింగ్ పోటీలో మంగళవారం జరిగిన పోటీలో మంచి పోరాట పటిమ కనబరిచి ఒక స్వర్ణ , రెండు కాంస్య పతకాలు సాధించగా అథ్లెటిక్స్ లోక రజతం సాధించారు.  రెజ్లింగ్ మహిళల  57 కేజీల  విభాగంలో నాగలక్ష్మి పసిడి పతకం సొంతం చేసుకుంది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఆమె కర్ణాటకకు చెందిన సాయి సిద్ధిపై 10 -0  స్కోర్ తో ఘన విజయం సాధించింది. గ్రీకో రోమన్ 77 కేజీలో కాంస్య పతక పోరులో జాదవ్  చరణ్  హనీష్ కుమార్ (ఛత్తీస్ గడ్) పై 8-0 తేడాతో గెలుపొంది కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. పురుషుల గ్రీకో రోమన్ 135 కేజీల నార్డిక్  విభాగంలో రాజు కాంస్య పతకం గెలుచుకున్నాడు. జగ్దల్పూర్ లో జరిగిన అథ్లెటిక్స్ లో 110 మీటర్ల హడ్డిల్స్ లో దత్తు రజతం సాధించడం విశేషం. ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండి సోనీ బాలాదేవి, ఈ పోటీల చీఫ్ డీ మిషన్ గుగులోతు అశోక్ కుమార్, రెజ్లింగ్ కోచ్ మూడ్ జైపాల్ లు అభినందించారు.

Related posts

ఆరోగ్య సంరక్షణ కొసం ఫిజియోథెరపీ కీలక పాత్రతెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసి తీసుకువస్తాం సిఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో ప్రధాన జీవనాధారం వ్యవసాయమే: సీఎం రేవంత్ రెడ్డి