(జై భారత్ వాయిస్ న్యూస్ నర్సంపేట)
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నర్సంపేట జీవిత భీమా సంస్థలోని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ ఉద్యోగులు ఏజెంట్స్ అఖిల భారత సంస్థ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మధ్యాహ్నం భోజనవిరామసమయంలో ధర్నా నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం వల్ల గత ఏడు సంవత్సరాలనుండి లేబర్ యాక్ట్ ను తుంగలోతొక్కి యాజమాన్యం ఆయా సంస్థల్లో పనిచేసే కార్మికుల పాత చట్టాలలో ఇరవై తొమ్మిది చట్టాలను మర్చేసింది వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను ఎప్రిల్ ఒకటి నుండి కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది ఇంకా ఉద్యోగభద్రతకు భంగం కలిగించే విధమైన చట్టాలను వేతనాహక్కుల. సామాజిక భద్రతకు చేటు తెచ్చే చట్టాలను అమలు చేయుటకు వ్యతిరేకంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ICEUఉద్యోగులు AOI ఫెడరేషన్ ఏజెంట్ మిత్రులు సంయుక్తంగా మధ్యాహ్నం భోజనవిరామసమయములో కార్యాలయం ఆవరణలో ధర్నా “”బ్లాక్ డే “”పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాలో ఎల్ ఐసి ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రసిడెంట్ జె. రత్న ప్రణయ్ ICEU సెక్రటరీ బి. బిక్షపతి ఉద్యోగుల సంఘ సభ్యులు, ఏజెంట్స్ ప్రెసిడెంట్ సెక్రెటరీ పెండ్లి రవి, సుధాకర్ రావు, శ్రీనివాస్, గణేష్, శంకరయ్య, రమేష్ ,పాల్గొన్నారు.

