Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

హనుమకొండలో శాస్త్ర విజ్ఞాన అభివృద్ధికి ప్రత్యేక దృష్టి

జై భారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గురువారం హంటర్ రోడ్ జూ పార్క్ సమీపంలోని రీజనల్ సైన్స్ సెంటర్‌ను KUDA చైర్మన్ ఇనగాల వెంకట్రం రెడ్డి ,జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి సందర్శించి అక్కడి పరిస్థితులను సమగ్రంగా సమీక్షించారు. సైన్స్ సెంటర్ పనితీరు, శాస్త్ర సాంకేతిక పరికరాల వినియోగం, భవన సౌకర్యాలపై ఎమ్మెల్యే ప్రత్యేకంగా దృష్టి సారించారు.సెంటర్‌లో పనిచేయని పరికరాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, వాటిని తక్షణమే మరమ్మతు చేసి ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు చేరువ కావాలంటే సెంటర్‌ను ఆధునికీకరించడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి ప్రతిపాదించిన కొత్త పరికరాలు, సదుపాయాలపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ, అవసరమైన ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలని సూచించారు. ప్రజలకు ఉపయోగపడే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి తాను పూర్తిగా మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు.

Related posts

ప్లాస్టిక్ రహిత సంచుల తయారీ కేంద్రాన్ని సందర్శించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే

తాడిశెట్టి విద్యాసాగర్ ను పరామర్శించిన పశ్చిమ ఎమ్మెల్యే

హైదరాబాద్ కు దీటుగా వరంగల్ ను అత్యుత్తమంగా అభివృద్ధి చేస్తాం..ఇందుకోసం నేను నిద్ర పోను..