Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో గ్రూప్ -1అధికారులతో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సమావేశం

జై భారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ: గ్రూప్-1 కేడర్ కు ఎంపికై వివిధ జిల్లాల్లో అధికారులుగా నియమితులైన వారు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎంతో బాధ్యతగా నిర్వర్తించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 64మంది గ్రూప్-1 అధికారులతో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సమావేశమయ్యారు.రాష్ట్రంలో గ్రూప్ వన్ ఎగ్జామ్స్ లో సెలెక్ట్ అయ్యి క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చిన 64 మంది గ్రూప్-1 కేడర్ ఆఫీసర్లు ఆత్మకూరు, దామెర మండలాల్లో స్వయం సహాయక సంఘాలు, గ్రామ సంఘాల, మండల సమైక్య సమావేశాలను పరిశీలించారు. క్షేత్ర పర్యటన అనంతరం హనుమకొండ కలెక్టరేట్ కు రాగా జిల్లా కలెక్టర్ వారితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ గ్రూప్ వన్ ఉద్యోగాలను యంగ్ ఏజ్ లోనే సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. తక్కువ ఏజ్ లోనే ఉద్యోగం సాధించిన వారికి ఎంతో సర్వీస్ ఉంటుందన్నారు. ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఎంతో కష్టపడి చదివి గ్రూప్ వన్ కేడర్ ఉద్యోగాన్ని సాధించారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని బాధ్యతగా తీసుకొని ప్రజలకు సేవ చేయాలని తెలియజేయడం జరిగింది. ఉద్యోగాన్ని బాధ్యతగా తీసుకొని ఆ ఉద్యోగానికి న్యాయం చేయాలన్నారు. ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. డి ఆర్ డి ఓ మేన శ్రీను, సెర్ఫ్ డైరెక్టర్ నవీన్, అడిషనల్ డి ఆర్ డి ఓ వెంకటేశ్వర్లు, ఎం సి హెచ్ ఆర్ డి ఫీల్డ్ విజిట్ ఆఫీసర్ శ్రీనివాస్, డిపిఎంలు దయాకర్, అనిత, ఏపిఎం రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

సెంట్ థెరిసా పాఠశాల లో ఘనంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు

మేడారం జాతర భక్తుల సౌకర్యార్థం హోర్డింగ్ పాయింట్లు ఏర్పాట్లు

ఆయుష్మాన్ భవ ఆరోగ్య అవగాహన