Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఎన్టీఆర్

“జై అమరావతి” మన రాజధాని హోం మంత్రి అనిత నివాసం వద్ద సంబరాలు బైక్ ర్యాలీలో పాల్గొన్న హోం మంత్రి అనిత

జై భారత్ వాయిస్ న్యూస్ నక్కపల్లి, :- అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లును ఉభయసభలు ఆమోదించిన నేపథ్యంలో నక్కపల్లిలో హర్షాతిరేక వాతావరణం నెలకొంది. హోం మంత్రి వంగలపూడి అనిత నివాసం వద్ద నాయకులు, కార్యకర్తలతో కలిసి సంబరాలు నిర్వహించారు. మంత్రి కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుతూ ఆనందాన్ని పంచుకున్నారు. “జై అమరావతి”, “మన రాజధాని.. మన అమరావతి” అంటూ నినాదాలతో నక్కపల్లి మారుమోగింది.సారిపల్లిపాలెం మంత్రి నివాసం నుంచి నక్కపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు మంత్రి అనిత ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వందలాది మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొని జాతీయ జెండాలు, ప్లకార్డులతో ఉత్సాహంగా నినాదాలు చేశారు. అనంతరం నక్కపల్లిలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మరియు స్వర్గీయ ఎన్.టి. రామారావు విగ్రహాలకు మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు అని,గత ఐదు సంవత్సరాల్లో అమరావతి తీవ్రంగా అణచివేతకు గురైందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతికి పునర్జీవం లభించిందని చెప్పారు.పదేళ్ల నిరీక్షణ తర్వాత అమరావతి రాజధానికి చట్టబద్ధత వచ్చింది అని తెలిపారు. అమరావతి కోసం సుమారు 1600 రోజుల పాటు రైతులు పోరాటం చేశారని, వారు అనేక ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గర్వంగా చెప్పుకునే రోజు అని అన్నారు. ఇంకా 11 పార్టీలు అమరావతికి మద్దతు ప్రకటించాయని, అసెంబ్లీలో సీఎం బిల్లు ప్రవేశపెట్టిన సమయం కూడా ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా ఉందని తెలిపారు. అమరావతి చరిత్ర ఎంతో గొప్పది. ఎవరొచ్చినా రాజధానిని కదిలించలేరు అని స్పష్టం చేశారు. అమరావతికి మద్దతు తెలిపిన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

Related posts

నూకాలమ్మ అమ్మవారి సేవలో మైలవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ను ఎగురవేయండి*

భ‌విష్య‌త్తులో ఆర్టిషియ‌ల్ ఇంటెలిజెన్స్, క్వాంట‌మ్ కంప్యూటింగ్ చాలా కీల‌కం  : ఎంపి కేశినేని శివ‌నాథ్