జై భారత్ వాయిస్ న్యూస్ రంగశాయిపేట
హనుమాన్ జయంతి సందర్భంగా వరంగల్ మిల్స్ కాలనీలోని శ్రీవీరాంజనేయ స్వామి దేవాలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ గారు భక్తులతో కలిసి శ్రీ హనుమాన్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ శ్రీ హనుమాన్ స్వామి ధైర్యం, భక్తితో యువత అచంచల విశ్వాసం, శక్తి, నిబద్ధతను అలవర్చుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, హనుమాన్ ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, సమాజంలో ఐక్యత, ధర్మం నిలవాలంటే హనుమాన్ ఆశీస్సులు అవసరమని మంత్రి కొండా సురేఖ అన్నారు.

