Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఎన్టీఆర్

2027 పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితమిస్తాం.

(జై భారత్ వాయిస్ న్యూస్ విజయవాడ)
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును 2027 పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితమిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో  మరో కీలక ఘట్టం పూర్తయ్యింది. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన 1372 మీటర్ల పొడవైన ‘డయాఫ్రం వాల్’ నిర్మాణాన్ని తక్కువ సమయంలో పూర్తి చేసిన ఇరిగేషన్ శాఖ అధికారులకు, ఇంజనీర్లకు అభినందనలు. దీనికి సహకరించిన కేంద్ర సంస్థలకు, పోలవరం ప్రాజెక్టు అధారిటీ ప్రతినిధులకు ధన్యవాదాలు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా డీ-వాల్ దెబ్బతినడంతో అదనంగా 1000 కోట్లు రూపాయలు వెచ్చించి నిర్మించాం. డయాఫ్రమ్ వాల్ పూర్తి కావటంతో ప్రధాన కట్టడమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ECRF) డ్యామ్ పనులు వేగవంతం అవుతాయి. ఇప్పటికే ప్రకటించినట్లు అన్ని పనులు పూర్తి చేసి 2027 పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితమిస్తాం.

Related posts

113 కోట్లతో గిరిజన వసతి గృహాల్లో మౌలిక సధుపాయాల కల్పన

ఎ. జ్యోతి

భయం అనేది RRR ఆర్ఆర్ఆర్ బయోడేటాలో లేదు

భ‌విష్య‌త్తులో ఆర్టిషియ‌ల్ ఇంటెలిజెన్స్, క్వాంట‌మ్ కంప్యూటింగ్ చాలా కీల‌కం  : ఎంపి కేశినేని శివ‌నాథ్