April 6, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

జూన్ 2వ తేదీన గచ్చీబౌలి స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన

(జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం)
క్రీడారంగంలో హైదరాబాద్‌ను దేశానికి ఒక రోల్ మాడల్‌గా తీర్చిదిద్దాలని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిచెప్పారు.గచ్చీబౌలి స్టేడియాన్ని ప్రపంచంలో ఒక అత్యుత్తమ క్రీడా వేదికగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమన్నారు. గచ్చీబౌలి స్టేడియాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించి కార్యాచరణపై ముఖ్యమంత్రి  తెలంగాణ స్పోర్ట్స్ హబ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో స్పోర్ట్స్ హబ్ చైర్మన్ సంజీవ్ గోయెంకా, కో-చైర్మన్ ఉపాసన కొణిదెల, సభ్యులు కావ్య మారన్ ,శశిధర్, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీన గచ్చీబౌలి స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామని,ఆ లోగా పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు.ఆ స్టేడియంలో హెలీప్యాడ్‌తో పాటు ప్రపంచస్థాయి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు.క్రీడాకారులు విమానాశ్రయం నుంచి నేరుగా హెలికాప్టర్‌లో స్టేడియంకు చేరుకునేలా ఏర్పాటు ఉండాలని, స్టేడియంకు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. ఇప్పటికే ఆర్కిటెక్ట్‌ను నియమించామని తెలిపారు. “స్టేడియం అభివృద్ధి విషయంలో స్పోర్ట్స్ హబ్ బోర్డుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా. దీర్ఘకాలంలో తెలంగాణలో క్రీడల అభివృద్ధి మా లక్ష్యం. ఒలింపిక్ క్రీడలు కూడా హైదరాబాద్‌లో నిర్వహించే స్థాయిలో సదుపాయాలు ఉండాలి. చైనాలో క్రీడా సౌకర్యాలను మించిన సదుపాయాలు కల్పించాలి.లక్షల సంఖ్యలో ఉన్న ఐటీ,ఇతర ఉద్యోగులను ఆకర్షించడానికి పెద్ద పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేయాలి..” అని బోర్డు సభ్యులకు సూచించారు.

Related posts

ముఖ్యమంత్రిని కలిసిన ఐజేయూ, టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం

MISS WORLD-2025 ప్రపంచ సుందరి 2025 పోటీకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి .ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

నూతన దంపతులను నిమ్స్ అనుసంధానకర్త మార్త రమేష్ అశీర్వదించారు