April 9, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

విద్యార్థుల స్థాయికి తగినట్లుగా బోధించాలి:ఖానాపూర్ ఎంఈఓ చరణ్ సింగ్

(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్):
విద్యార్థుల స్థాయికి తగినట్లుగా ఉపాధ్యాయులు ఆధునిక మెలుకువలతో బోధించేలా కృషి చేయాలని వరంగల్ జిల్లా ఖానాపూర్ మండల విద్యాశాఖ అధికారి మాలోతు చరణసింగ్ అన్నారు .ఖానాపూర్ మండలంలోని మనుబోతుల గడ్డ మండల ప్రాథమిక పాఠశాలను గురువారం సందర్శించారు తరగతి గదులలో ఉపాధ్యాయుల బోధనను పరిశీలించారు. విద్యార్థుల పఠన నైపుణ్యాలను పరిశీలించారు
ఎఫ్ ఎల్ ఎన్ పై విద్యార్థులను ప్రశ్నించారు. మధ్యాహ్నం భోజనం తనిఖీ చేశారు. అంగన్వాడి కేంద్రాన్ని భవిత సెంటర్ ను సందర్శించి తగు సూచనలు అందించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి చరణసింగ్ మాట్లాడుతూ విద్యార్థులు SA-2 పరీక్షలకు అందరూ హాజరయ్యేటట్లు ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలని కోరారు. గ్రామంలోని ప్రతి అంగన్వాడి సెంటర్లో నుండి పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు అంగన్వాడీ సిబ్బంది కృషి చేయాలని అన్నారు. పిల్లలకు మధ్యాహ్న భోజనంలో పోషకాహారాలను అందించేలా చూడాలని అన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో ఎక్కువమంది విద్యార్థులను నమోదు అయ్యేలా చూడాలని ఉపాధ్యాయులను కోరారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాకాని అశోక్ ఉపాధ్యాయులు వాంకుడోత్ వాగ్య భూక్య వీరన్న ,ఓల్లాల అశోక్ ,బిల్లా వెంకటేశ్వర్లు, సి ఆర్ పి తండ రమేష్ ఒడిఆర్ పి మహేందర్ అంగన్వాడీ టీచర్ కవిత విద్యార్థులు పాల్గొన్నారు అనంతరము ఉన్నత పాఠశాల, బండమీది మామిడి తండా ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు. అక్కడి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి తగు సూచనలు అందించారు.

Related posts

వరంగల్ డిసిపి భారీ ని కలిసిన నరకాసుర ఉత్సవ కమిటీ సభ్యులు

Jaibharath News

బీఆర్ఎస్ పార్టీ నుంచి బిజెపి లో చేరికలు

కులగనన ప్రక్రియ తక్షణమే ప్రారంభించాలి చాపర్తి కుమార్ గాడ్గే